కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతం నుంచి దేశంలోని …పలు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున మామిడి ఎగుమతవుతుంటుంది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా...... ఎక్కడి సరకు అక్కడే ఉండిపోయింది. కాయలు కోసేందుకు కూలీలు,.తరలింపునకు లారీలూ దొరకట్లేదు. కృష్ణా జిల్లాలో 54వేల పైచిలుకు హెక్టార్లలో మామిడి సాగవుతోంది. 4లక్షల మెట్రిక్ టన్నులకుపైగా... దిగుబడి అంచనా వేసిన ఉద్యానశాఖ నాణ్యమైన ధరకే మామిడి కొనుగోలుకు చర్యలు తీసుకుంది. ఇంతలోనే కరోనా కష్టాలు చుట్టుముట్టడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం తమ మొరను ఆలకించి.. నష్టాల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు
ఇదీ చదవండి :