ETV Bharat / city

Elections: ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాథమిక హక్కు కాదు: హైకోర్టు - ఏపీ హై కోర్టు వివరాలు

Election Nomination: అతడు రెవెన్యూశాఖలో ఉద్యోగి. ఏపీ సచివాలయ సెక్షన్‌ అధికారుల సంఘం ఎన్నికల్లో పోటి చేసేందుకు ప్రయత్నించాడు. కానీ, తనని పోటీ చేయకుండా అడ్డుకున్నారని.. తన నామినేషన్ తిరస్కరించడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అంటూ కోర్టులో అతడు పిటిషన్ వేశాడు. విచారణ చేపట్టిన న్యాయముర్తి ఎన్నికల్లో పోటీ చేయడం చట్టబద్ధహక్కు మాత్రమేనని.. ప్రాథమిక హక్కుకిందకు రాదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని న్యాయముర్తి గుర్తు చేశారు. రిజిస్ట్రేషన్‌ చట్ట నిబంధనలను అనుసరించి జిల్లా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది.

Election Nomination
ఎన్నికల్లో పోటీ చేయడం హైకోర్టు
author img

By

Published : Oct 5, 2022, 3:03 PM IST

Contesting elections is only a legal right: ఎన్నికల్లో నామినేషన్‌ తిరస్కరణపై వేసిన వ్యాజ్యానికి విచారణ అర్హత ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయడం అనే విషయం చట్టబద్ధహక్కు మాత్రమేనని.. ప్రాథమిక హక్కుకిందకు రాదని స్పష్టం చేసింది. ఏపీ సచివాలయ సెక్షన్‌ అధికారుల సంఘం ఎన్నికల విషయంలో తన నామినేషన్‌ని తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ రెవెన్యూశాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌ వాసుదేవరావు హైకోర్టును ఆశ్రయించారు.

ప్రస్తుత వ్యవహారంలో ఏపీ సొసైటీల రిజిస్ట్రేషన్‌ చట్ట నిబంధనలను అనుసరించి జిల్లా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వ్యాజ్యాన్ని గరిష్ఠంగా ఆరు నెలల్లో పరిష్కరించాలని జిల్లా కోర్టును ఆదేశించింది. వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. నామినేషన్‌ తిరస్కరణపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదని పిటిషన్‌ను కొట్టివేసింది. ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాథమిక హక్కు కాదని.. అది చట్టబద్ధమైన హక్కు అని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని న్యాయముర్తి గుర్తు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.