ఇసుక కొరత గుంటూరు జిల్లాలో ఇద్దరు కార్మికులను బలి తీసుకుంది. తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన గుర్రం నాగరాజు (38) అనే తాపీమేస్త్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇసుక కొరత కారణంగా నాగరాజుకు కొన్నాళ్లుగా ఉపాధి దొరకలేదు. ఓ వైపు కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉండగా... మరోవైపు పిల్లల స్కూలు ఫీజులూ కట్టలేని పరిస్థితి వచ్చిందని నాగరాజు భార్య తెలిపారు. చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురై తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె చెప్పారు.
పొన్నూరులోనూ...
పొన్నూరులోనూ మరో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగులమందు తాగి అడపా రవి అనే తాపీ మేస్త్రీ మృతి చెందాడు. 4 రోజులుగా తీవ్ర మనస్తాపంతో ఉన్న రవి.. చివరికి నిన్న రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉపాధి లభించని పరిస్థితుల్లోనే.. రవి ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధిత కుటుంబీకులు ఆవేదన చెందారు.
సంబంధిత కథనం