గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరై నిర్మాణాలు చేపట్టని 20,403 మంది లబ్ధిదారులు ప్రస్తుతం ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో మొదటి విడత కింద నిర్మాణాలు చేపట్టొచ్చు. శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులో ప్రభుత్వం అందుకు అనుమతులు ఇచ్చింది. 2016-17, 2017-18, 2018-19 సంవత్సరాల్లో పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో ఇళ్లు మంజూరై నిర్మాణాలు చేపట్టని వారికి ఈ అవకాశం ఇచ్చింది.
పురపాలక సంఘాల్లో 10,827, పట్టణాభివృద్ధి సంస్థల్లో 9,576 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇస్తున్న రూ.1.80 లక్షల రాయితీ వర్తింపజేస్తారు. మొదటి విడత కింద ఇప్పటికే నిర్మాణం చేపట్టిన 15.10 లక్షల ఇళ్లకు ఇవి అదనమని ఉత్తర్వులో పేర్కొంది.
ఇదీ చదవండీ.. Viveka Murder Case: సీబీఐ దర్యాప్తు వేళ సంచలనంగా మారిన వివేకా కుమార్తె లేఖ