రాష్ట్రానికి విభజన హామీలు, ప్రత్యేక హోదా వంటి అంశాలలో భాజపా తీరని అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం రాజధాని అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి నేటికి 5 ఏళ్లు పూర్తయిందని ఆమె తెలిపారు. నాడు దేదీప్యమానంగా వెలిగిన రాజధాని..వైకాపా ప్రభుత్వ చర్యలతో నేడు కళావిహీనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాన్ని అపహాస్యం చేస్తూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన మూడు రాజధానుల అంశానికి ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే వైకాపా, భాజపా రైతు వ్యతిరేక ప్రభుత్వాలుగా మిగిలిపోతాయన్నారు. నాడు రాజధాని అమరావతి శంకుస్థాపన రోజున మోదీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె కోరారు.
ఇదీ చదవండి