ETV Bharat / city

కాంగ్రెస్ ర్యాలీలో అపశృతి.. ఎడ్లబండిపై నుంచి జారిపడిన దామోదర రాజనర్సింహ - telangana varthalu

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై మెదక్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎడ్ల బండి పైనుంచి జారి కిందపడ్డారు.

congress leader Damodar Raja Narsimha slipping
కాంగ్రెస్ ర్యాలీలో అపశృతి
author img

By

Published : Jul 12, 2021, 5:37 PM IST

ఎడ్లబండిపై నుంచి జారిపడిన దామోదర రాజనర్సింహ

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై తెలంగాణలోని మెదక్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎడ్ల బండి పైనుంచి జారి కిందపడ్డారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఎద్దులు బెదరడంతో అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ఘటనలో రాజనర్సింహ మోకాలికి స్వల్ప గాయమైంది. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.

ఏఐసీసీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పెట్రో ధరల పెంపుపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర కాంగ్రెస్​ పార్టీ నిర్ణయించింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ఇన్‌ఛార్జీలను నియమించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో సైకిళ్లను, రిక్షాలను, ఎడ్లబండ్లను ఉపయోగించి నిరసన ప్రదర్శనలు చేపట్టేలా కార్యాచరణను ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెదక్​లో ఎద్దుల బండితో కాంగ్రెస్​ సీనియర్​ నేత దామోదర రాజనర్సింహ నిరసన ప్రదర్శన చేపట్టారు. మైక్​ అందుకుని ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఆ శబ్ధానికి ఎద్దులు బెదరడం వల్ల అదుపు తప్పి కిందపడిపోయారు. స్వల్ప గాయాలు కావడంతో కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికపైనా పీసీసీ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ ఎన్నిక బాధ్యతలను కూడా పీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ దామోదర్‌ రాజనర్సింహకు అప్పగించారు.

ఇదీ చదవండి:

తిరుపతిలో నిరుద్యోగ గర్జన... నూతన జాబ్ క్యాలెండర్​కు డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.