ETV Bharat / city

టీపీసీసీ అధ్యక్షుని ఎంపికపై మల్లగుల్లాలు.. పీఠం ఎవరికి దక్కేనో..!

టీ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. అధిష్ఠానంలో ఈ విషయం చర్చకు వచ్చిన ప్రతీసారి.. పార్టీ విధేయుల పేరుతో సీనియర్లు అడ్డుకుంటూనే ఉన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉండి జెండా మోసిన వారికే అధ్యక్ష పదవి దక్కాలంటూ డిమాండ్​ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 'రెడ్డి' సామాజిక వర్గం వారు పీఠంపై ఉన్నందున.. ఈసారి ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారికి అధ్యక్ష పదవిని కట్టబెట్టాలనే వాదనా గట్టిగా వినిపిస్తోంది.

Congress high command
Congress high command
author img

By

Published : Jul 21, 2020, 11:56 AM IST

తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారయింది. అధిష్ఠానంలో ఈ అంశం చర్చకు రావడం.. ఆ తర్వాత ఉన్నఫలంగా ఆగిపోవడం పరిపాటిగా మారింది. అధ్యక్ష పదవిపై ఏఐసీసీ ఎప్పుడు తుది నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ అంతుపట్టని ప్రశ్నగా మారింది.

అధ్యక్ష పీఠం కోసం ఆశావాహులు ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రధానంగా ఇద్దరు ఎంపీల మధ్యే పోటాపోటీ నడుస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవడం వల్ల ఆయనకే పీసీసీ పీఠం దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి సైతం అధ్యక్ష పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రేవంత్​రెడ్డి ఇటీవల బెంగళూరు వెళ్లి.. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి రావడం వల్ల అధ్యక్ష పీఠం రేవంత్​రెడ్డికి వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలూ ఎక్కువయ్యాయి.

మరోసారి అధిష్ఠానానికి లేఖ..

ఈ నేపథ్యంలో రేవంత్​రెడ్డి ఎంపికను వ్యతిరేకిస్తున్న కొందరు సీనియర్లు.. విధేయుల ఫోరం తరఫున అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దిల్లీ స్థాయిలో పార్టీ పెద్దలతో తమకున్న పరిచయాలను ఉపయోగించుకుని అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వొద్దని.. మొదటి నుంచి పార్టీ జెండాను మోసిన వారికే పీఠం కట్టబెట్టాలని ఇప్పటికే రెండుసార్లు అధిష్ఠానానికి లేఖలు రాసిన విధేయుల ఫోరం.. మరోసారి లేఖ రాసేందుకు సమాయత్తం అవుతోంది.

ఓ మాజీ పీసీసీ అధ్యక్షుడు సైతం

మరోవైపు ఓ మాజీ పీసీసీ అధ్యక్షుడు సైతం అధ్యక్ష పీఠం కోసం దిల్లీ స్థాయిలో చర్చలు జరుపుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా పీసీసీ అధ్యక్ష ఎంపిక జరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా పీసీసీ పీఠాన్ని కోరుకుంటున్న ఇద్దరు ఎంపీల నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​పై తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా తాను పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేయడం లేదని.. అధిష్ఠానం తనకు ఏం చెబితే.. ఆ పని చేసుకుంటూ పోతానని ఇటీవల మీడియాతో ఇష్ఠాగోష్టిగా మాట్లాడిన సందర్భంలో రేవంత్​రెడ్డి స్పష్టం చేయడం కొసమెరుపు.

ఇదీచూడండి:

ఇవాళ రాష్ట్రపతిని కలువనున్న ఎంపీ రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.