కొత్తగా ఎన్నికైన మేయర్, ఉప మేయర్, పురపాలక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల రాష్ట్రస్థాయి సదస్సును.. ఈనెల 31 నుంచి రెండు రోజులపాటు విజయవాడలో నిర్వహించనున్నారు. ఎ-కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే సదస్సుకు ముఖ్యమంత్రి జగన్ హాజరై ప్రసంగిస్తారు.
ఈ మేరకు పురపాలకశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ‘స్థానిక’ పరిపాలనలో మేయర్లు, ఛైర్మన్ల విధులు, బాధ్యతలు, అధికారాలు వంటి అంశాలపైనా నిపుణులతో అవగాహన కల్పించనున్నారు. ఏప్రిల్ 1 సాయంత్రం 5.30 గంటలకు సదస్సు ముగియనుంది.
ఇదీ చదవండి: