సోమవారం జరగనున్న వ్యాక్సినేషన్ డ్రై రన్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి లార్జిస్టిక్స్ను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో కేంద్రంలో ఐదుగురు సిబ్బంది ఉంటారు. విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. డ్రై రన్‌కు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నార.
వ్యాక్సిన్ కోసం వచ్చే వ్యక్తి ప్రవేశ మార్గంలో తన వివరాలను మహిళా పోలీసుకు తెలపాలని అధికారులు సూచించారు. ఒక్కో కేంద్రంలో మూడు గదులుంటాయి. మొదటి గదిలో రిజిస్ట్రేషన్ , రెండో గదిలో వ్యాక్సినేషన్, మూడో గదిలో అబ్జర్వేషన్ చేస్తారని తెలిపారు. ఒక్కో కేంద్రంలో 25 మందికి వ్యాక్సినేషన్ ఇస్తారని తెలిపారు. విజయవాడ జీజీహెచ్, తాడిగడప కృష్ణవేణి డిగ్రీ కాలేజీ, ప్రకాష్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్, పూర్ణ ఇనిస్టిస్ట్యూట్, ఉప్పులూరు పీహెచ్‌సీల్లో డ్రైవ్ రన్ చేపడుతున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ తీసుకునే వారి వివరాలు కో విన్ యాప్‌లో ముందుగానే రిజిస్ట్రర్ చేశామని తెలిపారు.
ఇదీ చదవండి