ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ బాధ నుంచి త్వరగా కోలుకునే మానసికశక్తిని కుటుంబ సభ్యులకు అందించాలని భగవంతుని ప్రార్థిస్తూ.. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
లోకేశ్ సంతాపం: ప్రముఖ నటులు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరాదేవి మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేసారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నా అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాలకృష్ణ సంతాపం: ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మరణం బాధాకరమని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పవన్‌కల్యాణ్: మహేశ్‌బాబు మాతృమూర్తి ఇందిరాదేవి తుదిశ్వాస విడిచారనే విషయం విచారం కలిగించిందని జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబు మాతృమూర్తి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. విజయనిర్మలతో పరిచయం అయ్యాక కృష్ణ ఇందిరాదేవికి విడాకులిచ్చారు. ఆ తర్వాత మహేశ్ బాబు వద్దనే ఉంటున్నారు ఇందిరా దేవి. మహేశ్ బాబు కుటుంబ సభ్యులకు పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇవీ చదవండి: