ETV Bharat / city

పాఠశాల విద్యకు సంబంధించి 8 వారాల ఎన్​సీఈఆర్టీ క్యాలెండర్​ - private school education news

రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా అనుసరించాల్సిందేనని పాఠశాల విద్యా కమిషనర్​ చినవీరభద్రుడు స్పష్టం చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేవరకూ పాఠ్య పుస్తకాలను బోధించకూడదని ఆదేశించారు. అధికారులు నిబంధనలు పాటించాలని సూచించారు.

ప్రైవేటు యాజమాన్యాలు ఎన్​సీఈఆర్టీ క్యాలండర్​ అనుసరించాల్సిందే

author img

By

Published : Jul 11, 2020, 8:12 AM IST

Updated : Jul 11, 2020, 12:14 PM IST

పాఠశాల విద్యకు సంబంధించి రాష్ట్రంలో ఇంకా అకడమిక్​ క్యాలెండర్​ తయారు కాలేదని పాఠశాల విద్యా కమిషనర్​ చినవీరభద్రుడు స్పష్టం చేశారు. ఎన్‌సీఈఆర్టీ రూపొందించిన 8 వారాల ప్రత్యామ్నాయ క్యాలెండర్​ను అనుసరించాలని సూచించారు. రీజనల్​ జాయింట్​ డైరెక్టర్లు, డీఈఓలు నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. పనిదినాలు, సిలబస్ తగ్గింపుతో విద్యార్థులపై ప్రభావం లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆన్‌లైన్ అభ్యాసం కొనసాగించడాన్ని ప్రోత్సహించాలని.. పాఠశాలలు సామాజిక మాధ్యమం, టెనోలజీ సాయంతో విద్యను అందించాలని సూచించారు.

నూతన విద్యా సంవత్సరం పునఃప్రారంభించే వరకు ప్రైవేటు అన్​ఎయిడెడ్​ యాజమాన్యాలు తరగతి పాఠ్య పుస్తకాలను బోధించకూడదని విద్యా కమిషనర్​ వీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు పాఠశాలలు ఆన్​లైన్​ తరగతులకు ఫీజులు చెల్లించాలని అడగడం సహా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి మార్కులు, ర్యాంకులు ఇస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. విద్యార్థులకు ఎలాంటి పరీక్షలను నిర్వహించవద్దని.. మార్కులను వెల్లడించకూడదని చెప్పారు.

ఇదీ చూడండి..

కరోనా వేళ... ఎంసెట్​ ఎలా? విద్యార్థుల్లో సందేహాలు

Last Updated : Jul 11, 2020, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.