ఇక నుంచి వాణిజ్య పన్నులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల విభాగాలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న రెండు విభాగాలు ఇక నుంచి ఆర్ధిక శాఖకు మార్చినట్టుగా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్, రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ డైరెక్టర్, ఐజీ కార్యాలయాలు, ఏపీ వ్యాట్ ట్రైబ్యునల్ లాంటి సంస్థలన్నీ ఆర్ధికశాఖ నియంత్రణలో పనిచేస్తాయని స్పష్టం చేసింది. ఆర్ధిక వనుల నిర్వహణను సులభతరం చేసేందుకు ఈ మార్పులు చేసినట్టుగా ప్రభుత్వం పేర్కోంది. ఈ అంశాలను ఆర్ధిక శాఖలోని కార్యదర్శి గుల్జార్ పర్యవేక్షిస్తారని వెల్లడించింది.
ఇదీ చదవండి:
తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిలువరించండి: కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ లేఖ