-
స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష. pic.twitter.com/CwJn6fuPsS
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష. pic.twitter.com/CwJn6fuPsS
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 8, 2020స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష. pic.twitter.com/CwJn6fuPsS
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 8, 2020
కొవిడ్ పట్ల నిర్లక్ష్యం వద్దని... నిరంతం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన కీలక అంశాలపై మాట్లాడారు. కొవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఉదాసీనత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో కొవిడ్-19 పరీక్షలు తప్పనిసరిగా జరగాలని ఆదేశించారు. అన్ని అవసరాలకు 104 కాల్ సెంటర్‌ను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఆర్‌టీపీసీఆర్, ట్రూనాట్ పరీక్షల ఫలితం 24 గంటల్లో రావాలన్న సీఎం.... కిట్లు లేవనే పేరుతో పరీక్షలు నిరాకరించకూడదని స్పష్టం చేశారు.
'కొవిడ్ దృష్ట్యా అదనంగా 17 వేలమంది వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలు చేపట్టాం. ఆరునెలల కాలానికి కాంట్రాక్ట్ విధానంలో నియమించేందుకు అనుమతులు ఇచ్చాం. మరో 11 వేల మంది ట్రైనీ నర్సులను తీసుకోవాలని నిర్ణయించాం. మరో వారంలో రెగ్యులర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేయాలి.'
- ముఖ్యమంత్రి జగన్
నరేగాకు సంబంధించి రాష్ట్రానికి 4.25 కోట్ల పనిదినాలు అదనంగా వచ్చాయని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అదనంగా మెటీరియల్ కాంపోనెంట్ కూడా పెరుగుతుందన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఈ నెలాఖరు నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: