ETV Bharat / city

ఆసరా, చేయూత కింద పాడి పశువుల పంపిణీ: సీఎం జగన్

వైఎస్​ఆర్ చేయూత, ఆసరా కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఈ నెల 26న ఆసరా, చేయూత పథకాల కింద మహిళలకు పాడి పశువులను పంపిణీ చేయాలని సీఎం నిర్ణయించారు. దశల వారీగా పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

cm ys jagan
cm ys jagan
author img

By

Published : Nov 19, 2020, 4:09 PM IST

ఈనెల 26న ఆసరా, వైఎస్​ఆర్ చేయూత కింద మహిళలకు పాడి పశువుల పంపిణీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. వైఎస్​ఆర్ చేయూత, ఆసరా కార్యక్రమాలపై సమీక్షించిన ఆయన...అధికారులకు పలు సూచనలు చేశారు. వర్చువల్ విధానంలో 4వేల గ్రామాల్లో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దశల వారీగా పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

  • In a review meeting, Hon'ble CM @ysjagan directed officials to commence the distribution of livestock to women beneficiaries of YSR Aasara & Cheyutha from 26th of November. The State Govt. plans to distribute 2,11,780 cows, 2,57,211 buffaloes, 1,51,671 sheep & 97,480 goats. pic.twitter.com/UFD9G3TC0D

    — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తొలుత ఆ జిల్లాల్లోనే...

తొలుత ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రారంభించగా.. తర్వాత దశలవారీగా మిగిలిన జిల్లాల్లో పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఒక్కో యూనిట్‌ ధర రూ.75 వేలుగా నిర్ణయించగా.. ప్రాజెక్టు విలువ రూ.5,386 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ప్రణాళికాబద్ధంగా పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. మహిళల్లో స్వయం సాధికారత, సుస్థిర ఆర్థికాభివృద్ధి కోసం కార్యక్రమం అమలు చేయనున్నట్లు తెలిపారు.

చేయూత, ఆసరా పథకాల కింద మహిళలు ఏర్పాటు చేసుకున్న దుకాణాలపై సీఎం సమీక్షించారు. ఇప్పటివరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 78 వేల దుకాణాలు ప్రారంభమయ్యాయని అధికారులు వివరించారు. చేయూత కింద కొత్తగా లబ్ధి పొందిన 2.78 లక్షల మంది నుంచి ఆప్షన్లు తీసుకోవాలని సూచించారు. ఖాళీగా ఉన్న వెటర్నరీ పోస్టులను భర్తీ చేయాలని సంబంధిత శాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.

ఇదీ చదవండి

మంత్రి కొడాలి నానిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఎస్‌ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.