ETV Bharat / city

ఆ దాబాల్లో మద్యం అమ్మొద్దు.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ విధానాన్ని పునఃసమీక్షించాలి: సీఎం జగన్

author img

By

Published : Feb 14, 2022, 4:56 PM IST

cm jagan on Road Safety: రాష్ట్రంలో రహదారి ప్రమాదాలు తగ్గించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశమైన రోడ్డు సెఫ్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. రోడ్డు భద్రత కోసం చర్యలు తీసుకునేందుకు లీడ్ ఏజెన్సీని ఏర్పాటు చేయటంతో పాటు.. ప్రస్తుతం ఇస్తున్న డ్రైవింగ్ లైసెన్సుల జారీ విధానంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. రోడ్ల పక్కన మద్యం అమ్మకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

cm YS Jagan
cm YS Jagan review on Roads and Buildings Department

CM Jagan on Road Safety : ముఖ్యమంత్రి అధ్యక్షతన రహదారి భద్రతా మండలి సమావేశమైంది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రహదారి ప్రమాదాలు, వాటికి కారణాలు, నివారణకు తీసుకోవాల్సిన అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రోడ్డు భద్రతా మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు సీఎం ఆమోదముద్ర వేశారు. రాష్ట్రంలో రోడ్‌ సేఫ్ట్‌ మీద లీడ్‌ ఏజెన్సీ ఏర్పాటుకు సీఎం పచ్చజెండా ఊపారు. పోలీసు, ట్రాన్స్‌పోర్ట్, హెల్త్‌, రోడ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల నుంచి నిపుణులతో లీడ్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. రోడ్‌ సేఫ్టీ ఫండ్‌ ఏర్పాటునకు సీఎం జగన్ ఆమోదముద్ర వేశారు. ప్రమాద బాధితులకు చికిత్స కోసం క్యాష్‌లెస్‌ ట్రీట్‌ మెంట్‌ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్యాష్ లెస్ ట్రీట్​మెంట్ ఇచ్చే నెట్‌వర్క్‌ ఆస్పత్రుల జాబితా తయారు చేసి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పారు.

యాప్ సేవలు వినియోగించుకోవాలి..

ఐరాడ్‌ యాప్‌ వినియోగించుకుని ప్రమాదాలపై లైవ్‌ అప్‌డేట్‌ పొందేలా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి జగన్. పీపీపీ పద్ధతిలో రవాణాశాఖ ద్వారా ఆటోమేటెడ్‌ ఎఫ్‌సీ టెస్టింగ్‌ ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని పునఃసమీక్షించాలి..

cm jagan on driving license process: రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రహదారి ప్రమాదాలు, కారణాల గురించి సీఎంకు అధికారులు నివేదించారు. రాష్ట్రవ్యాప్తంగా 1190 బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించామని తెలిపారు. 520 స్పాట్స్‌ను రెక్టిఫై చేశామని చెప్పారు. ఆర్‌అండ్‌బీ నిర్వహిస్తున్న నేషనల్ హైవేల్లోనూ 78 బ్లాక్‌ స్పాట్స్‌ను రెక్టిఫై చేశామన్నారు. రోడ్డుపై లైన్ మార్కింగ్‌ చాలా స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బైక్‌లకు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకంగా లైన్లు ఏర్పాటు చేయడంపై ఆలోచించాలన్నారు. రోడ్లపై ఎంత వేగంతో వెళ్లాలో సూచిస్తూ సైన్‌ బోర్డులు తప్పకపెట్టాలని, ఫలితంగా చాలా వరకు ప్రమాదాలు తగ్గే ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు. రోడ్లు పక్కన దాబాల్లో మద్యం అమ్మకుండా చూడాలని, దీనివల్ల చాలా వరకు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ముఖ్యమైన రోడ్ల పక్కన యాక్సెస్‌ బారియర్స్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల వారీగా ఏర్పాటవుతున్న కమిటీలు.. రోడ్డు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ తగిన నివారణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ విధానాన్ని పునఃసమీక్షించాలని సీఎం ఆదేశించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వం సహకారంతో కలిపి ఒక డ్రైవింగ్‌ స్కూలు ఏర్పాటు చేయాలని సూచించారు

ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయండి..

రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించడంపై సమావేశంలో చర్చించారు. ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు కాపాడటంలో 108లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. నిర్దేశిత సమయంలోగా పేషెంట్లను ఆస్పత్రులకు చేర్చుతూ క్షతగాత్రుల ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్‌ కళాశాలల్లోనూ ట్రామా కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అత్యాధునిక పద్ధతుల్లో ఎమర్జెన్సీ సర్వీసులు అందించాలన్నారు. ప్రమాదాలకు గురైన వారు కోలుకునేందుకు వీలుగా వైజాగ్​లో రీహాబిలిటేషన్‌ సెంటర్‌ను ఉంచాలన్నారు. తిరుపతి బర్డ్‌ ఆస్పత్రుల్లో ఉన్న సెంటర్‌ను మెరుగుపరచాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

"ఐరాడ్‌ యాప్‌ ద్వారా ప్రమాద వివరాలు పొందేలా చూడాలి. పీపీపీ పద్ధతిలో ఆటోమేటెడ్‌ ఎఫ్‌సీ టెస్టింగ్‌ ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలి. ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా చూడాలి. ప్రతి ఎంపీ స్థానంలో ఆర్టీసీ, ప్రభుత్వ సహకారంతో డ్రైవింగ్‌ స్కూల్‌ పెట్టాలి. కొత్త జిల్లాలకు అనుగుణంగా ట్రామా కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి. కొత్తగా వచ్చే 16 వైద్య కళాశాలల్లో ట్రామాకేర్‌ సెంటర్లు పెట్టాలి. ప్రమాద బాధితులకు విశాఖలో రీహాబిలిటేషన్‌ సెంటర్‌ నిర్వహించాలి. రోడ్డుపై లైన్‌మార్కింగ్‌ స్పష్టంగా ఉండేలా చూడాలి. రోడ్ల పక్కన దాబాల్లో మద్యం అమ్మకుండా చూడాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ విధానాన్ని పునఃసమీక్షించాలి" - ముఖ్యమంత్రి జగన్

ఇదీ చదవండి

NGT: ఏపీలోని ఆ మూడు రిజర్వాయర్ల పనులు నిలిపివేయాలి: ఎన్జీటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.