ETV Bharat / city

ప్రభుత్వమే లే అవుట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలి: సీఎం జగన్ - mangalagiri -tadepalle municipal corporation latest news

పట్టణ, నగర పేదలకు తక్కువ ధరకు ప్లాట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు లే అవుట్లను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. లాభాపేక్ష లేకుండా లాటరీ పద్ధతిలో ప్లాట్లను కేటాయించాలని అధికారులకు సూచించారు. మధ్యతరగతి ప్రజలకు కూడా సొంత స్థలం, తద్వార సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా క్లియర్‌ టైటిల్‌, వివాదాల్లేని ప్లాట్లు మధ్యతరగతి ప్రజలకు అందుతాయని.... దీనికోసం మేథోమథనం చేసి విధానాన్ని రూపొందించాలని సీఎం ఆదేశించారు. మంగళగిరి- తాడేపల్లి మున్సిపాలిటీలు కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం.. తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు.

cm jagan
cm jagan
author img

By

Published : Jan 7, 2021, 5:44 PM IST

Updated : Jan 8, 2021, 5:29 AM IST

పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి కుటుంబాలకు తక్కువ ధరకు ఇళ్ల స్థలాలను కేటాయించేలా లేఅవుట్ల అభివృద్ధి కోసం ఒక విధానం సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వైఎస్‌ఆర్‌ హయాంలో రాజీవ్‌ స్వగృహ పేరిట పథకాన్ని అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌తో కలిసి ముఖ్యమంత్రి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సమీక్ష జరిపారు. ‘గతంలో రాజీవ్‌ స్వగృహలో ఇళ్లు కేటాయించారు. ఇప్పుడు వివాదాల్లేని స్థలాలను తక్కువ ధరకు ఇచ్చే కార్యక్రమాన్ని రూపొందించాలి’ అని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద స్థలాలు కొంటే టైటిల్‌ సరైనదేనా.. అనుమతులు ఉన్నాయా, లేవా అనే భయాలు ఉంటున్నాయి. ప్రభుత్వమే లేఅవుట్లు అభివృద్ధి చేస్తే అవన్నీ తొలగిపోతాయి. మధ్యతరగతి ప్రజల కోసం ఏదైనా చేయాలన్న క్రమంలో ఈ ఆలోచన వచ్చింది. దీనిపై అధికారులు ఆలోచించి ప్రజల సొంతింటి కల సాకారమయ్యేలా చూడాలి’ అని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు.
నగర పాలక సంస్థగా మంగళగిరి-తాడేపల్లి
గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాలను కలిపి నగరపాలక సంస్థగా (మున్సిపల్‌ కార్పొరేషన్‌) ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. వీటిలో అభివృద్ధి పనులకు సంబంధించి రూ.1,000 కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆ రహదారి విశాఖకు చిహ్నంగా ఉండాలి
‘భీమిలి నుంచి భోగాపురం వరకు తీరం వెంబడి 6 వరుసల్లో బీచ్‌ రోడ్డును అభివృద్ధి చేయనున్నాం. ఈ రహదారి విశాఖపట్నానికి ఒక చిహ్నంలా మిగిలిపోనుంది. దీనికి అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలి. పట్టణాల్లో ఘన వ్యర్థాల యాజమాన్య కార్యక్రమాల నిర్వహణలో కొత్త విధానాలను పరిశీలించాలి. పట్టణ గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయాలి’ అని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇదీ చదవండి:

'2024నాటికి అన్ని ప్రభుత్వ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్పు'

Last Updated : Jan 8, 2021, 5:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.