ETV Bharat / city

'ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా కరోనా పరీక్షల వేగం పెంచండి' - Andhra Pradesh government launched rapid kits

రాష్ట్రంలో రెడ్ జోన్లు, కంటైన్మెంట్ క్లస్టర్లలో గుర్తించిన అనుమానితులకు సంబంధించి నిర్ధరణ పరీక్షలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా ఈ ప్రక్రియను వేగంగా ముగించి వైరస్ సోకిన వారికి వైద్యం ప్రారంభించాల్సిందిగా సీఎం సూచించారు.

cm ys jagan review on corona
cm ys jagan review on corona
author img

By

Published : Apr 18, 2020, 7:01 PM IST

రాష్ట్రంలో కొవిడ్‌ నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. నిన్న ఒక్కరోజే ల్యాబ్‌లు, ట్రూనాట్‌ మిషన్ల ద్వారా 4వేలకుపైగా పరీక్షలు చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ర్యాపిడ్‌ టెస్ట్ పరికరాలు, స్క్రీనింగ్‌ కోసం వాడే కొత్త పరికరాల సహాయంతో గణనీయంగా పరీక్షల సామర్థ్యం పెరుగుతుందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు ల్యాబ్​లు పని చేస్తున్నాయని... వచ్చే వారం నాటికి వీటి సంఖ్యను 12కు పెంచుతామని చెప్పారు.

టెలీమెడిసెన్​ సేవలు అందిస్తున్నాం

లాక్ డౌన్ కారణంగా టెలిమెడిసిన్‌కు స్పందన వస్తోందని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ టెలీ మెడిసిన్‌కు 5219 కాల్స్‌ వచ్చాయని.. రిటర్న్‌ కాల్‌ చేసి వారికి వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. అవసరమైన వారికి ప్రిస్క్రిప్షన్లు పంపించామని, వారికి మందులు కూడా ఇప్పిస్తున్నామని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

100 రూపాయలకు 5 రకాల పండ్లు.. భేష్

రాష్ట్రంలో రూ.100కు ఐదు రకాల పండ్ల పంపిణీ బాగుందని సీఎం ప్రశంసించారు. వినూత్న మార్కెటింగ్‌ విధానాలపై మార్కెటింగ్‌ శాఖ వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. రవాణా వ్యవస్థలో కదలిక వచ్చిందని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రస్తుతం 35 శాతానికి రవాణా చేరుకుందని వివరించారు. క్వారంటైన్‌ సెంటర్లలో సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

'సీఎం నివాసం రెడ్​ జోన్​ పరిధిలోకి రాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.