సీఎం సమీక్షలో ప్రధానాంశాలు :
- ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల మార్పుపై ప్రధాన చర్చ
- తొలివిడతలో 12,918 ప్రాథమిక, 3,832 ఉన్నత పాఠశాలల రూపురేఖలు మార్చాలని నిర్ణయం
- మరుగుదొడ్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, రంగులు, ఫర్నిచర్ ఏర్పాటు
- తరగతి గదులకు మరమ్మతులు చేపట్టడం
- అవసరమున్న పాఠశాలలో అదనపు గదులు నిర్మాణం
- విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులను నియమించాలని నిర్ణయం
- ఖాళీలను భర్తీ చేయడానికి నియామకాల కోసం క్యాలెండర్ రూపొందించటం
సమీక్ష సందర్భంగా 42, 655 పాఠశాలల దృశ్యాలు, ఫోటోలను తీసినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దాదాపు 10.88 లక్షల ఫోటోలను అప్లోడ్ చేసినట్లు తెలిపారు. వీటిపై స్పందించిన సీఎం .. అన్ని సదుపాయాలు కల్పించాక మళ్లీ ఫోటోలు తీసి ప్రజల ముందుంచాలని అధికారులకు సూచించారు.