ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు బిహార్ సీఎం నితీశ్ కుమార్ గురువారం రాత్రి ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి కోసం పోటీలో ఉన్న తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నితీశ్ కోరినట్లు తెలిసింది. రాజ్యసభలో వైకాపాకు ఆరుగురు ఎంపీలు ఉన్నారు. ఈనెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనుండగా..తొలిరోజే డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థి గెలుపు కోసం సహకరించాలని సీఎం జగన్ను నితీశ్ కోరారు.
ఇదీ చదవండి