సూపర్ స్టార్ రజనీకాంత్‌కు సినిమా రంగంలో అత్యన్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్ హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి విశేష ఆదరణ పొందారన్నారు. సామాజిక సేవలో సూపర్ స్టార్ ముందున్నారని ప్రశంసించారు.
హీరో అయినా సాధారణ వ్యక్తిలా రజనీకాంత్ ఉంటారని.. ఇది ఆయన గొప్ప గుణానికి నిదర్శమని కేసీఆర్ అన్నారు. ఇలాంటి మరెన్నో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: