TS CM KCR Mumbai Tour schedule : దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్రంపై యుద్ధం ప్రకటచించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే... సీఎం కేసీఆర్‌కు ఫోన్‌చేసి ముంబయికి అహ్వానించారు. దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవడానికి ఠాక్రే సైతం గళం విప్పారు. ఇప్పటికే దేవెగౌడ, మమతా బెనర్జీ ముఖ్యమంత్రికి ఫోన్‌లు చేసి సంఘీభావం ప్రకటించారు. దేశ రాజీకాయాల్లో మార్పు రావాల్సి అవసరం ఉందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి మద్దతు పెరుగుతోంది.
కేసీఆర్‌కు మద్దతు
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో.... ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 20న సమావేశం కానున్నారు. ఠాక్రే ఆహ్వానం మేరకు... కేసీఆర్ ముంబయికి వెళ్లనున్నారు. దేశం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి... ఉద్దవ్ ఠాక్రే సంపూర్ణ మద్దతు పలికారు. భాజపా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.... సమాఖ్య న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి సంఘీభావం తెలిపారు. కేసీఆర్‌కు బుధవారం ఫోన్ చేసిన ఉద్ధవ్‌ఠాక్రే.... విభజన శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సరైన సమయంలో కేసీఆర్ గళం విప్పారని ఠాక్రే అభినందించారు.
భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు
రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు పోరాటం కొనసాగించాలని.... ఈ దిశగా ప్రజామద్దతు కూడగట్టాలని కేసీఆర్‌కు సూచించారు. తాము సంపూర్ణంగా మద్దతిస్తామని స్పష్టంచేశారు. . ఈనెల 20న ముంబయి వచ్చి... తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కేసీఆర్‌కు... ఉద్ధవ్‌ఠాక్రే విజ్ఞప్తి చేశారు. ఆ రోజు భవిష్యత్ కార్యాచరణ సమాలోచనలు చేద్దామని కోరారు. ఈ నేపథ్యంలో సీఎం ఈనెల 20న ముంబయికి వెళ్లనున్నారు. ఈ మేరకు సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇదీ చదవండి: