ETV Bharat / city

KCR DEADLINE: కేంద్రానికి సీఎం కేసీఆర్ 24 గంటల డెడ్​లైన్ - CM KCR Paddy war in Delhi

KCR 24 HOURS DEADLINE: దిల్లీ తెలంగాణ భవన్​ వద్ద చేపట్టిన తెరాస నిరసన దీక్షలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో భాజపా నేతలను విమర్శించారు. రాష్ట్ర భాజపా నేతలు తనను జైలుకు పంపుతామని అంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిని జైల్లో వేస్తామంటారా? దమ్ముంటే రండి.. అంటూ సవాల్​ విసిరారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో 24 గంటల్లో కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

KCR DEADLINE TO CENTRA
KCR DEADLINE TO CENTRA
author img

By

Published : Apr 11, 2022, 8:03 PM IST

కేంద్రానికి సీఎం కేసీఆర్ 24 గంటల డెడ్​లైన్

KCR 24 HOURS DEADLINE CENTRAL GOVT : రైతుల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సోమవారం దిల్లీ తెలంగాణ భవన్​ వద్ద చేపట్టిన తెరాస నిరసన దీక్షలో పాల్గొన్న సీఎం.. కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. తమ పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.

24 గంటల డెడ్​లైన్: కేంద్రానికి ఎదురుతిరిగితే సీబీఐ, ఈడీ కేసులు పెడతారన్న కేసీఆర్... భాజపాలో అందరూ సత్యహరిశ్చంద్రులే ఉన్నారా? అని ఎద్దేవా చేశారు. తనను జైలుకు పంపుతామని రాష్ట్ర భాజపా నేతలు అంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రిని జైల్లో వేస్తామంటారా? దమ్ముంటే రండి.. అని సవాల్​ విసిరారు. ధాన్యం కొనుగోలు కోసం దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని పిలుపునిచ్చారు. 24 గంటల్లో కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

భాజపా నిస్సిగ్గుగా వ్యహహరిస్తోంది. హిట్లర్‌, నెపోలియన్‌ వంటి అహంకారులు కాలగర్భంలో కలసిపోయారు. కేంద్రానికి ఎదురు తిరిగితే సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దాడులు చేస్తారు. భాజపాలో అందరూ సత్యహరిశ్చంద్రులే ఉన్నారా?. నన్ను జైలుకు పంపుతామని రాష్ట్ర భాజపా నేతలు అంటున్నారు. దమ్ముంటే కేసీఆర్‌ను జైలుకు పంపండి. - కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

ఇదీ చదవండి : New Ministers : జగన్‌ కాళ్లు మొక్కారు.. ముద్దులు పెట్టారు..!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.