ETV Bharat / city

కరోనా పరీక్షలపై కేసీఆర్ కీలక నిర్ణయం

author img

By

Published : Jun 14, 2020, 9:09 PM IST

కరోనా పరీక్షలు, చికిత్సల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు, చికిత్సకు అనుమతిచ్చారు. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

cm kcr
cm kcr

కొద్ది రోజులుగా తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. ప్రధానంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌... ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సుదీర్ఘ చర్చ అనంతరం కరోనా పరీక్షల నిర్వహణ విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు, చికిత్స అందించేందుకు అనుమతి ఇచ్చారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు, చికిత్స, పరీక్షలకు ధరలు నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నందున అక్కడ విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. 30 నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. 10 రోజుల్లో పరీక్షలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌, చుట్టుపక్కన 4 జిల్లాలపై ఎక్కువ దృష్టి సారించాలని సూచించారు. పాజిటివ్‌గా తేలినప్పటికీ వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేనివారికి ఇంట్లోనే చికిత్స అందించాలన్నారు. బాధితులకు చికిత్స అందించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రాష్ట్రంలో ఎందమందికైనా చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు, పడకలు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు సరిపడా ఉన్నాయన్నారు. కరోనా వైరస్‌ నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో కొత్తగా 294 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.