ధరణి పోర్టల్ ద్వారా 20 రోజుల్లో వ్యవసాయేతర ఆస్తులకు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఓపెన్ ప్లాట్లు సహా అన్ని రకాల ఆస్తుల వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు ప్రతి ఆస్తిని ప్రభుత్వం వద్ద నమోదు చేయాలని సీఎం తెలిపారు.
ప్రజల విజ్ఞప్తి మేరకు వ్యవసాయేతర ఆస్తుల వివరాలు బహిర్గతం చేయకుండా ఉంచుతామని హామీ ఇచ్చారు. సంపూర్ణ భూ హక్కు యాజమాన్య చట్టం తీసుకువస్తామని దానికి రెండేళ్ల సమయం పడుతుందని తెలిపారు. దుబ్బాకలో తెరాస మంచి మెజార్టీతో విజయం సాధిస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి :