కరోనా ప్రభావంతో ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల వేతనాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కోత విధించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు విశేష కృషి చేస్తోన్న వైద్య ఆరోగ్య, పోలీసు ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఇస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. వారికి మార్చి నెల పూర్తి వేతనం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ రెండు శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహం కూడా అందించాలని స్పష్టం చేశారు. ప్రోత్సహకాన్ని ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.
వైద్య సిబ్బందికి అధిక ప్రాధాన్యత:
కరోనా వైరస్ బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బంది భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్స్, ఎన్ 95 మాస్కులు, హైడ్రాక్సి క్లోరోక్విన్ మాత్రలు పంపిణీకి సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన మెడికల్ కిట్స్‌ను కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా వైరస్... జ్వరం, ఫ్లూ లాంటిదే: సీఎం జగన్