తెలంగాణలో 24 గంటల జనతా కర్ఫ్యూ పాటిద్దామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు స్వీయ గృహనిర్బంధంలో ఉందామని సీఎం విజ్ఞప్తి చేశారు. కరోనా నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు నడపబోమని స్పష్టం చేశారు. రాష్ట్రం సాధించుకున్న స్ఫూర్తితో కరోనా కట్టడిలో పాలుపంచుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల బస్సులను రానివ్వబోమని కేసీఆర్ ఉద్ఘాటించారు.
'జనతా కర్ఫ్యూ 14 గంటలు కాదు 24 గంటలు' - సీఎం కేసీఆర్ జనతా కర్ఫ్యూ
కరోనా వైరస్ ప్రబలకుండా ప్రధాని నరేంద్రమోదీ సూచించిన 14 గంటల జనతా కర్ఫ్యూను రాష్ట్రంలో 24 గంటలు పాటిద్దామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రేపు ప్రజలందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు.
'జనతా కర్ఫ్యూ 14 గంటలు కాదు 24 గంటలు'
తెలంగాణలో 24 గంటల జనతా కర్ఫ్యూ పాటిద్దామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు స్వీయ గృహనిర్బంధంలో ఉందామని సీఎం విజ్ఞప్తి చేశారు. కరోనా నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు నడపబోమని స్పష్టం చేశారు. రాష్ట్రం సాధించుకున్న స్ఫూర్తితో కరోనా కట్టడిలో పాలుపంచుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల బస్సులను రానివ్వబోమని కేసీఆర్ ఉద్ఘాటించారు.
ఇదీ చూడండి:
కరోనా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?