ETV Bharat / city

కర్నల్ సంతోష్ కుటుంబానికి నేడు కేసీఆర్ పరామర్శ

భారత్‌- చైనా సరిహద్దులో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు‌ పరామర్శించనున్నారు. వీర సైనికుడి కుటుంబాన్ని ఆదుకుంటామని ఇప్పటికే ప్రకటించిన సీఎం... ఇచ్చిన మాట ప్రకారం కుటుంబ సభ్యులను కలుసుకోనున్నారు.

cm-kcr-going-to-suryapeta-today-for-visitation-to-colonel-sathish-babu-family

author img

By

Published : Jun 22, 2020, 6:51 AM IST

గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్​ నేడు పరామర్శించనున్నారు. సూర్యాపేటలోని విద్యానగర్‌లో నివాసముంటున్న కర్నల్ కుటుంబ సభ్యులను కలుసుకోనున్నారు.

ఇటీవల ప్రకటించినట్లు... సంతోష్ సతీమణికి గ్రూప్-1 స్థాయి ఉద్యోగ నియామక పత్రం, ఇంటిస్థలం, 5 కోట్ల నగదు చెక్కును కేసీఆర్​ అందించనున్నారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగిలిన 19 మంది సైనికుల కుటుంబాలకు పదేసి లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం ఇంతకుముందే ప్రకటించారు. ఆ మొత్తాన్ని కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి

గల్వాన్​ లోయలో ఆ రోజు అసలేం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.