తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించిన సీఎం జగన్... రాష్ట్రంలోని ప్రతి ఇల్లూ కళకళలాడాలని ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాది ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలిగించాలన్నారు. కరోనా దృష్ట్యా సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాను అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని ఉద్ఘాటించారు. కొన్నాళ్లపాటు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు.
ఇదీ చదవండి : కరోనా: హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ప్రభుత్వం