ETV Bharat / city

రంజాన్ ప్రారంభం: ముస్లిం సోదరులకు సీఎం జగన్ శుభాకాంక్షలు

author img

By

Published : Apr 14, 2021, 3:14 AM IST

నియమనిష్ఠలతో రంజాన్ జరుపుకునే ముస్లింలపై అల్లాహ్ దీవెనలు ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా.. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

cm jagan, cm jagan ramzan wishes
సీఎం జగన్, ముస్లింలకు సీఎం జగన్ రంజాన్ మాసం శుభాకాంక్షలు

పవిత్ర రంజాన్ మాసం సంద‌ర్భంగా.. రాష్ట్రంలోని ముస్లింల‌కు సీఎం జగన్ ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. నెలపాటు నియ‌మనిష్ఠల‌తో క‌ఠిన ఉప‌వాస వ్రతం ఆచ‌రిస్తూ.. ఈ పుణ్యమాసాన్ని ముస్లిం సోదరులంతా జ‌రుపుకుంటార‌న్నారు. వారికి అల్లాహ్ దీవెన‌లు ల‌భించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: ఇండో పసిఫిక్​పై భారత్​, ఫ్రాన్స్ చర్చలు

మ‌హ‌నీయుడైన మహ్మద్ ప్రవ‌క్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది రంజాన్ మాసంలోనే కావ‌డంతో.. ముస్లింలు ఈ నెల‌కు అత్యంత ప్రాముఖ్యత‌‌నిస్తార‌ని సీఎం అన్నారు. రంజాన్ అంటే ఉప‌వాసాలు మాత్రమే కాద‌ని.. మ‌నిషిలోని చెడు భావాల్ని, అధ‌ర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప దీక్ష అని తెలిపారు.

ఇదీ చదవండి:

'కుమార్తెను చదివించాలి.. కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.