ETV Bharat / city

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం : సీఎం జగన్ - వరదలపై సీఎం జగన్ కామెంట్స్

రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితుల్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ నెల 31లోగా వరద నష్టంపై అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించిన ముఖ్యమంత్రి .. కొవిడ్ వ్యాప్తి నిరోధక చర్యలు, ఉపాధి హామీ, వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్​లు, గ్రామ సచివాలయాల తనిఖీలపై జిల్లా కలెక్టర్లకు వేర్వేరు ఆదేశాలు జారీ చేశారు.

Cm jagan
Cm jagan
author img

By

Published : Oct 20, 2020, 3:48 PM IST

Updated : Oct 20, 2020, 7:03 PM IST

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా నష్టపోయిన వారిని మానవతాదృక్పథంతో ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. మృతుల కుటుంబాలకు తక్షణం రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. వరదల కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఉచిత రేషన్ ఇవ్వాల్సిందిగా ఆదేశించామని సీఎం స్పష్టం చేశారు. శిబిరాల నుంచి వెళ్లే సమయంలో రూ. 500 వారి చేతికి ఇవ్వాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సీఎం మాట్లాడారు. అక్టోబరు 31వ తేదీలోగా పంట నష్టానికి సంబంధించిన తుది అంచనాలు పూర్తి చేయాల్సిందిగా సీఎం సూచించారు. ఈ నెల 27 తేదీన రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు సీఎం స్పష్టం చేశారు.

వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్థంభాల విషయంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. విద్యుత్ సరఫరాలను వేగంగానే పునరుద్ధరించటంపై జిల్లా కలెక్టర్లను సీఎం అభినందించారు. అటు రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని వెల్లడించారు. రోగులకు సంతృప్తికరమైన వైద్య సేవలు అందితేనే ప్రభుత్వం చేస్తున్న కృషికి సార్ధకత ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ సూచించారు.

27న రైతు భరోసా

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక సీజన్ ఇన్​పుట్ సబ్సిడీని అదే సీజన్ లో ఇస్తున్నామని.. ఖరీఫ్ సీజన్ ఇన్​పుట్ సబ్సిడీని, రైతు భరోసా రెండో విడత చెల్లింపులతో కలిపి ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల ఇన్​పుట్ సబ్సిడీ ఈ నెల 27న ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. మొత్తం రూ.145 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతులకు చెల్లించబోతున్నట్టు తెలిపారు. అటవీ భూముల పట్టాలు (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) ఇచ్చిన గిరిజనులకు కూడా రైతు భరోసా కింద ఈనెల 27న రూ.11,500 చొప్పున ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు.

రాష్ట్రంలో రోజుకు 70 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని పాజిటివిటీ రేటు ప్రస్తుతం 4.76 శాతానికి తగ్గిందని సీఎం తెలిపారు. 94.5 శాతం రికవరీ రేటుతో ఏపీ తొలి స్థానంలో ఉందన్నారు. రెండో దఫా కొవిడ్ వ్యాప్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొవిడ్ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు, శానిటేషన్ ఉండాలని స్పష్టం చేశారు. ఆరోగ్యమిత్రల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆదేశించారు. కొవిడ్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా మాస్కులు, భౌతిక దూరం, చేతుల శుభ్రత వంటి అంశాల ప్రచారం విస్తృతం చేయాలన్నారు.

నవంబరు 2 నుంచి పాఠశాలలు

ఈ ఏడాది నవంబరు 2 తేదీ నుంచి పాఠశాలలు తెరుస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రెండు రోజులకు ఒకమారు తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. 1,3,5,7 తరగతులకు ఒకరోజు 2,4,6,8 తరగతులకు మరోరోజున తరగతులు నిర్వహించేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులకు ఓ మారు తరగతులు నిర్వహించే అంశాన్ని పరిశీలంచాలని సీఎం సూచించారు. మద్యాహ్నం వరకు మాత్రమే పాఠశాలలు పనిచేసేలా షెడ్యూలు నిర్ణయించాలని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపాలని సీఎం సూచించారు. నవంబరు నెలలో ఈ ప్రణాళికను అమలు చేయాల్సిందిగా స్పష్టం చేశారు. డిసెంబరు నెలలో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు.

అంగన్​వాడీ కేంద్రాలకు సొంత భవనాలు

వర్షాలు వరదల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో శానిటేషన్ పై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్లకు సీఎం సూచించారు. పాముకాటు, కుక్క కాటు కోసం ఇంజెక్షన్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, వైయస్సార్‌ ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూళ్లకు ప్రహరీల నిర్మాణం వచ్చే ఏడాది మార్చి 31 వరకు పూర్తి కావాలని ఆదేశించారు. ప్రతి జిల్లాకు రూ.10 కోట్ల విలువైన పని దినాలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. సకాలంలో అన్నీ పూర్తి చేస్తే, అదనంగా మరో 5 కోట్ల పని దినాలు ఉపాధిహామీలో భాగంగా మంజూరు అవుతాయన్నారు. పాఠశాలల్లో చేపట్టిన పనులు నవంబరు 15 నాటికి పూర్తి చేయాలన్నారు. ఇప్పటికీ 153 పాఠశాలల్లో పనులు మొదలు కాకపోవటంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అద్దె భవనాల్లో కొనసాగుతున్న 27 వేల పైచిలుకు అంగన్ వాడీలకు సొంత భవనాల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించే ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు.7,375 అంగన్‌వాడీ కేంద్రాలకు స్థలాలు గుర్తించాల్సి ఉందన్నారు.

ఆరోగ్య కేంద్రాలతో వైద్య రంగంలో పెనుమార్పులు

గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించనున్న ఆరోగ్య కేంద్రాలు వైద్య రంగంలో పెనుమార్పులు తీసుకువస్తాయని సీఎం వ్యాఖ్యానించారు. కొత్తగా నిర్మించతలపెట్టిన వైద్య కళాశాలల భూసేకరణ సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా కలెక్టర్లకు సూచించారు. ఆదోని, పిడుగురాళ్ల, కాకినాడ, ఒంగోలు, అనంతపురంలోనూ సమస్యలు ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని సీఎం తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల తనిఖీపైనా జిల్లా కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలన్నారు. అక్కడి సేవలపై ఆరా తీయాలన్నారు. నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా సేవలందుతున్నాయో లేదో చూడాల్సిందిగా సీఎం ఆదేశించారు.

ఉచిత విద్యుత్ రైతు హక్కు

నవంబరు 6న జగనన్న తోడు పథకం ప్రారంభిస్తామని తెలిపారు. జగనన్న తోడు పథకం దరఖాస్తుదారులందరికీ బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు మంజూరు చేయించాలన్నారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్‌ సరఫరాలో మరింత నాణ్యత ఉంటుందన్న విషయంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఒక హక్కు అని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇవ్వడం కోసం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.

ఇదీ చదవండి : జగన్ ఆస్తుల కేసు విచారణ ఈనెల 27కు వాయిదా

Last Updated : Oct 20, 2020, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.