రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కన్నబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలను.. రూ.2,495 కోట్లతో గ్రామ సచివాలయాలకు అనుబంధంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను నేరుగా రైతులకు సరఫరా చేసేలా కియోస్క్‌లు రూపొందించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా భూసార పరీక్షలు, మార్కెట్ వివరాలు తెలియజేస్తారు. ఆర్‌బీకే ద్వారా వాతావరణ సూచనలు, పంటరుణాలు, ఇ - పంట నమోదు జరుగుతాయి.
సీఎం యాప్ ఆవిష్కరణ
ఈ సందర్భంగా సీఎం యాప్‌ను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. వ్యవసాయ సంబంధ అంశాలు, పంటల ధరలు, మార్కెటింగ్ పరిస్థితులను రైతులు నేరుగా తెలుసుకునేందుకు వీలుగా ఈ యాప్ రూపొందించారు.
ఇవీ చదవండి: