కరోనా మహామ్మారి నుంచి ప్రజలను రక్షించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ అవగాహనలేమి, నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. వైకాపా ఎమ్మెల్యేల తీరుతోనే కరోనా విజృంభించిందని ఆరోపించారు. తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడితే ఏపీలో కేసులు ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. గ్రీన్జోన్లోనైనా సీఎం పర్యటించి ప్రజల్లో ధైర్యం నింపాలని డిమాండ్ చేశారు. సీఎం బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టకపోతే ప్రజలకు భరోసా కల్పించేదెవరని నిలదీశారు. స్థానిక ఎన్నికలపై ఉన్న శ్రద్ధ కరోనా కట్టడిలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి..