ETV Bharat / city

అర్హులకు కచ్చితంగా సంక్షేమ పథకాలు అందాలి: సీఎం జగన్

ప్రజలు స్పందన పోర్టల్ ద్వారా ఇచ్చిన వినతులను ప్రాధాన్యత ప్రకారం వర్గీకరించి సత్వరమే పరిష్కరించాలని.. సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అర్హత కల్గిన వారికి తప్పనిసరిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు. ప్రజల సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు ఆధునికీకరించిన స్పందన వెబ్​సైట్​ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ సమర్థంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

సీఎం జగన్
సీఎం జగన్
author img

By

Published : Mar 26, 2021, 8:11 PM IST

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పందన వెబ్​సైట్​ను ప్రభుత్వం ఆధునికీకరించింది. నూతన స్పందన పోర్టల్‌ను ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. పౌరుడు వినతిపత్రం ఇచ్చాక.. అది పరిష్కారం అయ్యే తీరును నేరుగా అధికారులు, ఉన్నతాధికారులు ట్రాక్‌ చేయాలని ఆదేశించారు. ఈ ట్రాకింగ్‌ మెకానిజం చాలా పటిష్టంగా ఉండాలని స్పష్టం చేశారు. పౌరుల నుంచి వచ్చిన గ్రీవెన్స్‌లను పరిష్కరించకుండా పక్కనపడేసే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. నేరుగా సీఎం కార్యాలయ అధికారులు గ్రీవెన్స్‌ల పరిష్కారంపై ఎప్పటికప్పుడు పరిశీలన, సమీక్ష చేయాలని ఆదేశించారు.

కచ్చితంగా చెప్పగలగాలి...

గ్రీవెన్స్‌ను తిరస్కరిస్తున్నప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నారో కచ్చితంగా చెప్పగలగాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. పౌరుల నుంచి వచ్చిన గ్రీవెన్స్‌ పరిష్కారానికి అర్హమైనదిగా గుర్తించిన తర్వాత తప్పకుండా దాన్ని పరిష్కరించాలని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా గ్రీవెన్స్‌ పరిష్కారం కాకపోతే అది ఏస్థాయిలో నిలిచిపోయింది అనే విషయం తెలియాలని చెప్పారు. సంబంధిత సిబ్బంది, అధికారికి అలర్ట్స్‌ వెళ్లాలని... స్పందన వినతుల పరిష్కారమనేది కలెక్టర్ల పనితీరుకు ప్రమాణంగా భావిస్తామని సీఎం స్పష్టం చేశారు. నవరత్నాల్లో ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు.

సోషల్‌ ఆడిట్‌ సమయంలోనే...

నవరత్నాల పథకాల సోషల్‌ ఆడిట్‌ సమయంలోనే అర్హులైన వారిపేర్లు రాలేదని తెలిసిన వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయినా ఎవరైనా మిగిలిపోయిన పక్షంలో పథకం అమలు చేసిన తేదీ నుంచి నెలరోజుల పాటు వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని, తర్వాత నెలలో వెరిఫికేషన్‌ చేయాలని సూచించారు. వాటిని వెంటనే పరిష్కరించి.. మూడో నెలలో వారికి నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. దరఖాస్తు చేసిన 90 రోజుల్లో ఇంటి పట్టా అందాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కచ్చితంగా 90 రోజుల్లో ఇంటి పట్టా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

అధికారులదే బాధ్యత...

నిర్ణీత సమయంలోగా ఇంటిపట్టా అందించాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన 90 రోజుల్లోగా ఇంటి పట్టా అందించాలన్నది ప్రభుత్వ నిర్ణయమని ఉద్ఘాటించారు. సుమారు లక్ష వరకూ ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు మళ్లీ వచ్చాయని తెలపగా... మరోసారి తనిఖీ చేసి అర్హులకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వచ్చే నెలలో ఇంటి పట్టాలకు సంబంధించి దరఖాస్తుల రీ వెరిఫికేషన్‌ పూర్తిచేయాలన్నారు. దరఖాస్తులను తిరస్కరించేముందు ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని సూచించారు. అర్హులన్నవారు ఎవ్వరూ మిగిలిపోకూడదని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

కొత్త ఫీచర్లు...

ఆధునికీకరించిన స్పందన పోర్టల్​లో పలు కొత్త ఫీచర్లు ఉంచారు. పాత పోర్టల్‌లో 2677 సబ్జెక్టులు, 27,919 సబ్‌ సబ్జెక్టులు ఉండగా.. అప్‌డేషన్‌ చేసిన పోర్ట్‌ల్‌లో 858 సబ్జెక్టులు, 3758 సబ్‌ సబ్జెక్టులు ఉంటాయని... దీనివల్ల చాలా సమయం ఆదా అవుతుందని ప్రభుత్వం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాలు లక్ష్యంగా కొత్త స్పందన పోర్టల్‌ రూపొందించామని, పౌరులు నేరుగా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించినట్లు తెలిపింది. గ్రామ సచివాలయాల ద్వారా కాని, కాల్‌ సెంటర్‌ ద్వారా కాని, వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా కాని, మొబైల్‌ యాప్‌ ద్వారా కాని, ప్రజా దర్బార్ల ద్వారా కాని వినతులు ఇచ్చే అవకాశం ఉందన్నారు.

తీసుకున్న వినతులు అత్యంత తీవ్రమైనవి, తీవ్రమైనవి, సాధారణమైనవిగా వర్గీకరించనున్నట్లు తెలిపారు. తాము ఇచ్చిన వినతి లేదా, దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మూడు ఆప్షన్స్‌ ఇచ్చారు. వెబ్‌ లింక్‌ ద్వారా లేదా 1902కు కాల్‌చేసి లేదా, గ్రామ సచివాలయాల ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించారు. తాము చేసిన వినతి పరిష్కారం పట్ల పౌరుడు సంతృప్తి చెందకపోతే తిరిగి మళ్లీ అదే ఫిర్యాదును ఓపెన్‌ చేసి జిల్లాస్థాయిలో లేదా విభాగాధిపతిస్థాయిలో మళ్లీ విజ్ఞాపన చేయవచ్చని అధికారులు తెలిపారు. సేవలపట్ల పౌరుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటారని, వినతుల పరిష్కారంలో నాణ్యత ఉందా, లేదా, అని తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో సర్వేలు, థర్డ్‌ పార్టీ ఆడిట్‌ జరుగుతుందని వివరించారు.

ఇదీ చదవండీ... 'మే 3 నుంచి రోజువారి విచారణకు ధర్మాసనం నిర్ణయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.