ETV Bharat / city

'భూముల రీసర్వే.. ప్రతి కమతానికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య'

author img

By

Published : Oct 22, 2020, 9:01 PM IST

Updated : Oct 22, 2020, 10:51 PM IST

రాష్ట్రవ్యాప్తంగా భూములను రీసర్వే చేసి ప్రతీ భూమికి ఓ ప్రత్యేక సంఖ్యను కేటాయించేందుకు ఉద్దేశించిన సమగ్ర సర్వేపై.. సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. త్వరితగతిన ఈ ప్రాజెక్టును ప్రారంభించి పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. భూధార్ పేరిట ప్రత్యేక నెంబరు జారీ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. భూ సమగ్ర సర్వేతో నిర్దేశిత సమయంలోగా రాష్ట్రంలోని రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

CM Jagan Review on Land Re Survey in Andhra Pradesh
సీఎం జగన్ సమీక్ష

రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల్లో తప్పులను సవరించేందుకు సమగ్ర రీసర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రెవెన్యూ రికార్డులన్నీ తప్పులతడకగా ఉండటంతో.. భూ రికార్డుల ప్రక్షాళనకు రీసర్వే చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.35 కోట్ల సర్వే నెంబర్లు సహా వివిధ రకాలైన భూముల కేటగిరీలను మళ్లీ సర్వే చేయించేందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

ఈ సమీక్షకు ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, రెవెన్యూ శాఖ అధికారులు, సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. భూ రికార్డులను సరి చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సీఎం అధికారులకు సూచించారు. కార్స్ టెక్నాలజీ (కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్సు స్టేషన్) సాయంతో రాష్ట్రంలో రీసర్వే చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టుగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రీసర్వే అనంతరం ప్రతీ భూమికి ఓ ప్రత్యేకమైన సంఖ్యను కేటాయించనున్నట్టు అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలోని భూరికార్డుల వ్యవస్థను ప్రక్షాళన చేయటంతో పాటు పొరపాట్లను సవరించేందుకు ఈ రీసర్వే వివరాలను ఉపయోగించాల్సిందిగా సీఎం ఆదేశించినట్టు సమాచారం. దశలవారీగా 11,158 రోవర్స్ ద్వారా ఈ రీసర్వే చేపట్టేందుకు ప్రణాళిక చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దాదాపు రెండు వందల కోట్ల రూపాయల మేర భూముల రీసర్వే కోసం ప్రభుత్వం ఖర్చు చేయనుంది. భూముల రీసర్వే కోసం 65 కార్స్ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పైలట్ ప్రాజెక్టును కార్స్ టెక్నాలజీ ద్వారా రీసర్వే చేశారు. భూసేవా ప్రాజెక్టు కింద ప్రతీ కమతానికీ ఓ ప్రత్యేక గుర్తింపు నెంబరును కూడా ప్రభుత్వం జారీ చేయనుంది.

ఇదీ చదవండీ... 'శంకుస్థాపన చేసిన తర్వాత మూడున్నరేళ్లు ఏం చేశారు'

Last Updated : Oct 22, 2020, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.