ETV Bharat / city

వెనకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.. గృహనిర్మాణ సమీక్షలో సీఎం జగన్​

CM JAGAN REVIEW : గృహనిర్మాణంలో వెనకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్​ ఆదేశించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని.. ఇళ్లు పూర్తయ్యేసరికి తాగునీరు, విద్యుత్‌, పారిశుద్ధ్యం లాంటి వసతులు కల్పించాలి పేర్కొన్నారు. గృహనిర్మాణం, టిడ్కో ఇళ్లు, గురుకులాలు, వసతిగృహాల్లో నాడు-నేడు పనులపై సమీక్ష నిర్వహించారు.

CM JAGAN REVIEW
CM JAGAN REVIEW
author img

By

Published : Sep 22, 2022, 7:47 PM IST

CM REVIEW : ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించిన లక్ష్యం చేరుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణంలో వెనకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గృహ నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. ఇళ్లు పూర్తయ్యేసరికి తాగునీరు, విద్యుత్‌, పారిశుద్ధ్యం ఇతర మౌలిక వసతులు కల్పించాలని నిర్దేశించారు. ఆప్షన్‌ –3 కింద ప్రభుత్వం కట్టించి ఇచ్చే ఇళ్ల నిర్మాణం వేగవంతం చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు.

టిడ్కో ఇళ్లపైనా.. సీఎం సమీక్ష నిర్వహించారు. పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. డిసెంబరు నాటికి అన్ని ఇళ్లనూ లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. దరఖాస్తు చేసిన మూడు నెలల్లో ఇళ్లపట్టాలు ఇచ్చే కార్యక్రమంపైనా సీఎం సమీక్ష చేశారు. ఇప్పటికే 96వేల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని అధికారులు తెలిపారు. మరో లక్ష 7వేల మందికి పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమని వెల్లడించారు.

గురుకులాలపై సమీక్ష: గురుకులాలు, వసతిగృహాల్లో నాడు-నేడు పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్ల పర్యవేక్షణపై సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి గురుకులాల అకాడమిక్‌ పర్యవేక్షణను తీసుకొచ్చారు. ఈ బాధ్యతలు ఎంఈవోకు అప్పగించారు.

గురుకులాలు, హాస్టళ్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించిన సీఎం జగన్.. దీని కోసం ప్రత్యేక యాప్‌ కూడా రూపొందించాలన్నారు. గురుకులాలు, హాస్టళ్లలో మౌలిక వసతులు, భోజనం నాణ్యతపై నిత్యం పర్యవేక్షణ చేయాలని.. అన్ని వసతి గృహాల్లో భోజన నాణ్యత పెంచాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.