భారీ వర్షాలకు ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన బాధితులకు రూ.95 వేలు నగదుతో పాటు కొత్త ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్(cm jagan review) అధికారులను ఆదేశించారు. వరద బాధితులకు నిత్యవసరాల పంపిణీ, రూ.2 వేలు ఆర్థిక సహాయం, తాగునీటి సరఫరా, వైద్య శిబిరాలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి జగన్ నాలుగు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. త్వరితగతిన బాధితులకు సాయం అందటంతో పాటు విద్యుత్ ను పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు.
సహాయాన్ని వేగవంతం చేయాలి..
వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను నెలకొల్పే దిశగా అధికారులు ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. వరద ప్రభావిత నాలుగు జిల్లాల కలెక్టర్లతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలకు ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన బాధితులకు రూ.95 వేలు నగదుతోపాటు కొత్త ఇంటి కోసం రూ.1.8 లక్షలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిత్యావసరాల పంపిణీ, వరద బాధిత కుటుంబాలకు అదనంగా రూ.2 వేలు నగదు పంపిణీ, సహాయక శిబిరాల కొనసాగింపు, విద్యుత్, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
నివేదికలు ఇవ్వండి..
వరద సహాయం అందించడంలో పొరపాట్లకు తావివ్వొద్దని సీఎం స్పష్టం చేశారు. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినందున.. తాగునీటి కొరత రాకుండా చూడాలని సూచించారు. ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. రీ-డిజైన్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 104 కాల్ సెంటర్‌కు వచ్చిన వినతులపై వెంటనే స్పందించాలని, పశునష్ట పరిహారాన్నీ త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు. పంట నష్టపరిహారానికి సంబంధించి నివేదికలు వేగంగా పూర్తి చేయాలన్నారు. రహదారుల పునరుద్ధరణకు సంబంధించి కలెక్టర్లు వెంటనే నివేదికలు ఇవ్వాలని సూచించారు.
అప్రమత్తంగా ఉండాలి..
సాగు, తాగునీటి ప్రాజెక్టుల భద్రతపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న నీటి విడుల సామర్ధ్యంతో పాటు వరద ప్రవాహాలపై అంచనాలను పరిశీలించి నివేదికలు ఇవ్వాలని సూచించారు. ఈ నెల 26 తర్వాత మళ్లీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలరతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు.
మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాం..
వరదలతో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం, గల్లంతైన వ్యక్తుల ఆచూకీ, పశుదాణా పంపిణీ తదితర అంశాలపై సీఎం జగన్.. పలు సూచనలు చేశారు. ఈ మేరకు 95,949 మంది వరద బాధిత కుటుంబాలకు నిత్యవసరాలు అందించినట్టు అధికారులు సీఎంకు వివరించారు. చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో 19,832 మందికి మినహా అందరికీ నిత్యవసరాలు అందాయని జిల్లా కలెక్టర్లు సీఎంకు తెలిపారు. సహాయక శిబిరాల నుంచి ప్రజలందరూ తిరిగి ఇళ్లకు వెళ్లారని అధికారులు వెల్లడించారు. బురద పేరుకు పోయిన ఇళ్లలో అగ్నిమాపక వాహనాల ద్వారా శుభ్రపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారాన్ని(ex gratia to flood effected families) అందించామని, గల్లంతై ఆచూకీ లభ్యంకాని వారి విషయంలో ఎఫ్‌ఐఆర్, పంచనామాలు పూర్తిచేస్తున్నామని కలెక్టర్లు సీఎంకు వివరించారు.
ఇదీ చదవండి: