ETV Bharat / city

ప్రతీ దిశా స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్.. 900 వాహనాలు సిద్ధం: సీఎం - దిశ చట్టంపై సీఎం జగన్ సమీక్ష

రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ దిశా పోలీస్ స్టేషన్ పరిధిలోనూ దిశ పెట్రోలింగ్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతీ ఫిర్యాదుకూ నాణ్యమైన సేవలు అందించేలా కార్యాచరణ ఉండాలని సీఎం సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో దిశ చట్టం అమలు, పోలీసు స్టేషన్ల పనితీరుపై సమీక్షించిన సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

cm jagan review on dishan act
దిశ చట్టం అమలుపై సీఎం జగన్‌ సమీక్ష
author img

By

Published : Aug 13, 2020, 5:16 PM IST

Updated : Aug 13, 2020, 7:00 PM IST

రాష్ట్రంలోని ప్రతీ దిశా పోలీసు స్టేషన్ పరిధిలోనూ పెట్రోలింగ్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం 900 స్కూటర్లను ఏర్పాటు చేసినట్లు సీఎం పేర్కోన్నారు. దీంతో పాటు దిశా పోలీసు స్టేషన్ కు అందిన ప్రతీ ఫిర్యాదుపైనా నాణ్యమైన సేవలు బాధితులకు అందేలా చూడాలని అందుకు సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో దిశ చట్టం అమలు, పోలీసు స్టేషన్ల పనితీరుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు.

దిశ చట్టంతో పాటు, మొబైల్ యాప్, టోల్ ఫ్రీ నంబర్లకు సంబంధించిన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు, ప్రజలు ఎక్కువగా వచ్చి పోయే ప్రాంతాలు, వారు సమావేశమయ్యే చోట్ల పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించి విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు ప్రక్రియపైనా సీఎం జగన్ ఆరా తీశారు. వీలైనంత త్వరగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. దిశ చట్టం అమలు కోసం నేర శిక్షా స్మృతిలో సవరణలు చేస్తూ పంపిన బిల్లుకూ కేంద్రం ఆమోదం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. త్వరితగతిన ఫోరెన్సిక్ ల్యాబ్ లను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు రాష్ట్రంలో సైబర్ భద్రత కోసం కియోస్క్ లను ఏర్పాటు చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ఫోన్ లు, ల్యాప్ టాప్ ల భద్రతను పరీక్షించుకోవచ్చని వెల్లడించారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో దిశ మహిళా హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటు చేయటంతో పాటు సైకాలజిస్టుల నుంచి న్యాయ సహాయం లభించేలా చూడాలని అధికారులు కోరారు. ఇప్పటి వరకూ దిశా యాప్ 11 లక్షల డౌన్ లోడ్లు పూర్తి చేసుకుందని అధికారులు సీఎం కు వివరించారు. అలాగే ఈ యాప్ ద్వారా 107 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్టు డీజీపీ సహా అధికారులు సీఎంకు తెలిపారు. దిశ చట్టం కింద ఇప్పటి వరకూ 390 కేసులు నమోదు అయ్యాయని స్పష్టం చేశారు. ఈ కేసుల్లో 7 రోజుల్లోపు ఛార్జి షీటు దాఖలు చేసినట్టు అధికారులు వివరించారు. 74 కేసుల్లో శిక్షలు కూడా ఖరారు అయ్యాయని.. మూడు మరణశిక్షలు, ఐదు గురికి జీవిత ఖైదు, ఇద్దరికి 20 ఏళ్ల చొప్పున శిక్ష పడినట్టు తెలిపారు.

మరోవైపు సామాజిక మాథ్యమాల ద్వారా వేధింపులు ఆపడానికి సైబర్‌ బుల్లీ వాట్సాప్‌ నంబర్‌ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ అంశంలో ఇప్పటి వరకూ 27 వేల ఫిర్యాదులు వచ్చాయని సీఎంకు తెలిపారు. 780 మంది తరచుగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని గుర్తించామని అన్నారు. ఇ– రక్షా బంధన్‌ కార్యక్రమంలో భాగంగా 3.5 లక్షల మంది పాల్గోన్నారని స్పష్టం చేశారు. ప్రతీ జిల్లా కేంద్రంలోనూ దిశ ఒన్ స్టాప్ సెంటర్లు పనిచేస్తున్నాయని వివరించారు.

ఇదీ చదవండి:

ప్రతి పరిశ్రమకు ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య..!

Last Updated : Aug 13, 2020, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.