ETV Bharat / city

కరోనా సేవకులకు సెల్యూట్ : సీఎం జగన్ - కరోనా వార్తలు

ఐసోలేషన్‌లో ఉంచే వారికి మంచి సదుపాయాలు ఉన్న గదులు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. కొవిడ్ -19పై సమీక్షించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పంట నష్టంపై సమీక్ష చేసిన సీఎం...నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

cm jagan review on covid
cm jagan review on covid
author img

By

Published : Apr 11, 2020, 5:22 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి సహా అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో కేసుల పరిస్థితి, వ్యాధి నివారణా చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు. కొవిడ్‌ – 19 నివారణ కోసం ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాకు అదనంగా ఐదేసి ఆస్పత్రుల చొప్పున గుర్తిస్తున్నామని అధికారులు తెలిపారు. క్రిటికల్‌ కేర్‌ కోసం నాలుగు ప్రధాన ఆస్పత్రులు, ప్రతి జిల్లాకు ఒక ఆస్పత్రి సిద్దమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో వచ్చే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లాలకు అదనంగా ఐదు ఆస్పత్రుల చొప్పున సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

క్వారంటైన్, ఐసోలేషన్‌ గదుల్లో సదుపాయాలపై సీఎం జగన్ సమీక్షించారు. ఐసోలేషన్‌లో ఉంచే వారికి మంచి సదుపాయాలు ఉన్న గదులు ఇవ్వాలని స్పష్టం చేశారు. అక్కడ సౌకర్యాలు, సదుపాయలు ఉండేలా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడోసారి జరుగుతున్న కుటుంబ సర్వే వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. జలుబు, గొంతునొప్పి, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలతో ఉన్నవారి అందరికీ కూడా పరీక్షలు చేయించాలని మరోసారి అధికారులను సీఎం ఆదేశించారు.

నష్టపరిహారం చెల్లించండి

అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. పంట నష్టాన్ని గుర్తించేందుకు యుద్ధప్రాతిపదికన సర్వే పూర్తి చేయాలన్నారు. కరోనా వల్ల రైతులు నష్టపోకుండా మార్కెటింగ్ సదుపాయం సహా గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆదేశించారు. అలాగే పిడుగుపాటు, బోటు ప్రమాదంలో మరణించిన వారికి 24 గంటల్లోగా ఎక్స్‌గ్రేషియా అందించాలని సంబంధిత కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.

రవాణాలో ఇబ్బందులు ఉండొద్దు

వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. మొక్కజొన్న, శెనగ, కందులు, జొన్నలు, పసుపు లాంటి పంటలకు మార్కెటింగ్ సహా ధరల పరంగా రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం సూచించారు. పౌల్ట్రీ రంగాలకు సంబంధించిన వారితో మాట్లాడి మొక్కజొన్న కొనుగోలు చేసేలా చూడాలన్నారు. అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ యాప్‌ను అధికారులు సీఎంకు వివరించారు. గ్రామ సచివాలయాల్లో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు తప్పనిసరిగా తమ గ్రామాల్లోని పంటలు, వాటి ధరలపై ఎప్పటికప్పుడు యాప్‌ ద్వారా తెలియజేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. యాప్‌లో వచ్చిన సమాచారం ఆధారంగా వెనువెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. రొయ్యలు, చేపల ఉత్పత్తులను స్థానికంగా అమ్ముకునే అవకాశం కల్పిస్తూ చర్యలు తీసుకోవాలన్నముఖ్యమంత్రి ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.

ఇదీ చదవండి :

ఎస్​ఈసీ పదవి నుంచి రమేశ్ కుమార్ తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.