అమరావతిలోని నిర్మాణాలకు ఏమేర నిధులు అవసరమవుతాయో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతానికి అమరావతిలోని నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో తెలియచేయాలన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. అమరావతి ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయని ఆరా తీశారు. వాటిని పూర్తిచేసే కార్యాచరణపై అధికారులతో సీఎం చర్చించారు. నిధుల సమీకరణకు సంబంధించి ప్రణాళిక సిద్ధంచేసుకోవాలని స్పష్టం చేశారు. ఆర్థికశాఖ అధికారులతో కలిసి సమావేశమై ప్రణాళిక చేయాలని సూచించారు. హాపీ నెస్ట్ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఏఎంఆర్డీఏ అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: టిక్‌టాక్ కొనుగోలు రేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్!