ETV Bharat / city

'కరోనా ఎవరికైనా రావచ్చు.. బాధితులపై వివక్ష వద్దు' - cm review meeting with officers on corona status in ap

కరోనా మృతుల అంత్యక్రియలను అడ్డుకున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను సీఎం జగన్ ఆదేశించారు. కరోనా రోగుల పట్ల వివక్ష చూపవద్దని... కరోనా భయంకరమైనది కాదన్న విషయాన్ని తెలియజేయాలని సీఎం ఆదేశించారు. రైతు సమస్యల పరిష్కారంపై మరింత దృష్టి పెట్టాలన్న సీఎం... రైతుల కోసం కేటాయించిన 1902 టోల్‌ ఫ్రీ నంబర్​​కు వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.

'కరోనా ఎవరికైనా రావచ్చు.. బాధితులపై వివక్ష వద్దు'

author img

By

Published : Apr 30, 2020, 6:10 PM IST

రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌ ,వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. కేసులు అధికంగా నమోదవుతోన్న కర్నూలు జిల్లాపై సీఎం సమగ్రంగా సమీక్షించారు. సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్వారంటైన్లలో వసతి, మంచి భోజనం అందించాలన్నారు. జిల్లాలో కరోనా సోకిిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి స్పందించారు. ఇలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. కరోనా వైరస్ ఎవరికైనా సోకవచ్చని.. వారిని అంటరానివారిగా చూడడం సరికాదని హితవుపలికారు. బాధితులపై ఆప్యాయత, సానుభూతి చూపించాలి గానీ వివక్ష కూడదన్నారు.

వ్యవసాయంపై వైరస్​ ప్రభావంపై చర్చ

వ్యవసాయం - అనుబంధ రంగాలపై కరోనా ప్రభావం, నివారణ చర్యలపైనా సీఎం జగన్‌ చర్చించారు. 1902 టోల్‌ ఫ్రీ నంబర్‌ను గ్రామ సచివాలయాల్లో బాగా ప్రచారం చేయాలని.. కష్టం ఉందని ఎక్కడ నుంచి రైతులు ఫోన్‌ చేసి చెప్పినా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూపన్లు జారీ చేసి పంటలు కొనుగోలు చేసిన విధానం పట్ల రైతుల్లో సానుకూలత అధికారులు తెలపగా... అన్ని పంటలకూ ఇదే విధానాన్ని వర్తింప చేయాలని అన్నారు. రోజుకు 60 వేల టన్నుల ధాన్యం, 8 వేల టన్నులు మొక్కజొన్న సేకరిస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

మత్స్యకారులకు రూ.2 వేలు ఇవ్వాలి

గుజరాత్‌ నుంచి తెలుగు మత్స్యకారులను స్వస్థలాలకు తరలించే ప్రక్రియపై సీఎం ఆరా తీశారు. 4,065 మంది అక్కడి నుంచి బయలుదేరారని.. వారందరికీ రవాణా, భోజనం సహా దారి ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వచ్చిన మత్స్యకారులందరికీ రూ.2 వేల చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో నమోదైన కేసులు, తీసుకుంటున్న చర్యలపైనా సమీక్షించారు.

లాక్​డౌన్​ అమలుపై అధికారుల వివరణ

కేసులు అధికంగా వస్తున్న కర్నూలు, విజయవాడ, గుంటూరుల్లోని ప్రాంతాల్లో లాక్​డౌన్ పకడ్బందీగా అమలు చేయడం సహా పటిష్ట ఆరోగ్య వ్యూహాన్ని అమలు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. టెలిమెడిసిన్‌ ద్వారా రోగులకు మూడు రోజుల్లో మందులు అందేలా సమగ్ర వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 94,558 పరీక్షలు చేసినట్లు ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు. ఇవికాక 68 వేలకుపైగా ర్యాపిడ్‌ టెస్టులు చేశామని... గత మూడు, నాలుగు రోజుల్లో మరణాలు లేవని తెలిపారు. రానున్న రెండు మూడు రోజుల్లో డిశ్చార్జయ్యే వారి సంఖ్య బాగా పెరుగుతుందని వివరించారు.

ఇదీ చూడండి..

నేడో, రేపో ఏపీకి కేంద్ర బృందాలు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.