ETV Bharat / city

రైతుల నుంచి 30 శాతం పంట కొనుగోలు: సీఎం జగన్​ - ఈ మార్కెటింగ్​పై సీఎం జగన్ రివ్యూ

ఈ-మార్కెటింగ్​ ప్లాట్​ఫాంలపై రైతన్నలు పంటలు అమ్ముకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్​ ఆదేశాలిచ్చారు. పంటల ప్రణాళిక, ఈ - మార్కెటింగ్​లపై సీఎం సమీక్షించారు. ఆర్బీకే పరిధిలోని పంటలపై మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. రైతుల నుంచి 30 శాతం పంటను కొనుగోలు చేస్తామన్న ఆయన.. మిగతా 70 శాతం పంట అమ్ముకునేందుకు సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.

cm jagan
cm jagan
author img

By

Published : Jun 1, 2020, 3:00 PM IST

పంటల ప్రణాళిక, ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫాం అంశాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఏ పంటలు వేయాలన్న దానిపై మ్యాపింగ్‌ చేయాలని సీఎం.. అధికారులను ఆదేశించారు. జిల్లా, మండలస్థాయిల్లో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మార్కెటింగ్‌ చేయలేని పంటలు వేస్తే రైతులు నష్టపోతారని చెప్పారు.

ఈ–క్రాపింగ్‌పై మార్గదర్శకాలు, ఎస్‌వోపీలను తయారుచేయాలని సీఎం ఆదేశించారు. సంబందించిన విధివిధానాలను గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో ఉంచాలని సూచించారు. రైతుల వద్ద నుంచి 30 శాతం పంటలను కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. మిగతా 70 శాతం పంటలు కూడా అమ్ముడయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకు ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫాంను వినియోగించుకోవాలని చెప్పారు.

గ్రామస్థాయిలో గ్రేడింగ్, ప్యాకింగ్‌ సదుపాయాలు ఉండాలన్న సీఎం.. ఈ–మార్కెట్‌ విధానంలో పంటను అమ్మాలంటే నాణ్యత చాలా ముఖ్యమని గుర్తు చేశారు. గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్‌ చేయకపోతే నాణ్యత పాటించలేమన్నారు. ఈ ఖరీఫ్ నాటికి గ్రేడింగ్, ప్యాకింగ్ అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశాలిచ్చారు. రానున్న కాలంలో జనతా బజార్లకూ ఈ విధానాలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

మంగళవారం దిల్లీకి ముఖ్యమంత్రి జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.