ETV Bharat / city

YSR Vahanamitra:వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయం విడుదల - వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థికసాయం విడుదల చేసిన సీఎం

వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది.

cm jagan released
cm jagan released
author img

By

Published : Jun 15, 2021, 12:25 PM IST

Updated : Jun 16, 2021, 4:11 AM IST

'ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మంచి చేయాలని ఆలోచించిన ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా లేవు. మన రాష్ట్రంలోనే వారికి ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఈ వాహనాల బీమా, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, మరమ్మతుల కోసం అందజేస్తున్న సాయంతో వాటిలో ప్రయాణించే వారికీ భద్రత ఉంటుంది' అని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం కింద 2.48 లక్షల మంది ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్ల ఖాతాల్లో రూ.10వేలచొప్పున మొత్తం రూ.248.47 కోట్లను ఆయన మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మీట నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయం విడుదల చేసిన సీఎం

'రోజుకు రూ.50 చొప్పున జరిమానా వేస్తున్నారని, వాహన బీమాకు రూ.7,500, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌కు, మరమ్మతులు చేయించేందుకు రూ.10 వేలు ఖర్చవుతోందని పాదయాత్ర సందర్భంగా డ్రైవర్లు నా దృష్టికి తీసుకొచ్చారు. దీంతో 2018లో ఏలూరు సభలో డ్రైవర్లకు మాట ఇచ్చా. దాన్ని నిలబెట్టుకుంటూ వరుసగా మూడో ఏడాదీ డ్రైవర్లకు సాయం అందిస్తున్నాం. మూడేళ్లలో రూ.759 కోట్లు డ్రైవర్ల ఖాతాలో జమ చేశాం. ఎక్కువ మందికి రూ.30వేల చొప్పున సాయం అందింది' అని తెలిపారు.

గత ప్రభుత్వంలో చలాన్లతో భారం
గత ప్రభుత్వంలో ఆటోడ్రైవర్ల నుంచి చలాన్ల రూపంలో 2015-16లో రూ.7.39 కోట్లు, 2016-17లో రూ.9.68 కోట్లు, 2017-18లో రూ.10.19 కోట్లు, 2018-19లో రూ.7.09 కోట్లు వసూలుచేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక 2019-20లో రూ.68.44 లక్షలు, 2020-21లో రూ.35 లక్షలను కాంపౌండింగ్‌ ఫీజులుగా వసూలు చేశాం. అందరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించండి. మద్యం తాగి వాహనం నడపొద్దని మనవి చేస్తున్నా’ అని జగన్‌ సూచించారు.

95 అన్యాయాలు అన్నారు..
'వివక్ష లేకుండా డ్రైవర్లందరికీ సాయం అందేలా ఈ కార్యక్రమం అమలు చేస్తుంటే.. తెదేపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 95% హామీలు అమలుచేస్తే వాళ్లు 95 అన్యాయాలు అంటున్నారు. అందులో డ్రైవర్లకు సాయం కూడా ఉంది. మనం పన్నులు బాదామని అబద్ధాలు ఆడుతున్నారు. పళ్లున్న చెట్టు మీదే రాళ్లు పడతాయనే సామెత లాగే, మంచి చేసేవారిపైనే విమర్శలు చేసే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది' అని సీఎం వ్యాఖ్యానించారు.

అర్హులుంటే నెలలో దరఖాస్తుకు వీలు
‘అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాం. ఇంకా ఎవరైనా అర్హత ఉండి, ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేకపోతే దరఖాస్తు చేసుకోండి. వాలంటీర్ల సహాయం తీసుకోండి. సందేహాలుంటే 9154294326 నంబరుకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోండి. 1902 నంబరుకూ ఫోన్‌ చేయొచ్చు. ఈ కార్యక్రమం అమలు పర్యవేక్షణకు సంయుక్త రవాణా కమిషనరు ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశాం’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.
రుణపడి ఉంటాం
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలువురు డ్రైవర్లు సీఎం జగన్‌తో మాట్లాడారు. వరుసగా మూడో ఏడాది సాయం ద్వారా మొత్తం రూ.30వేలు అందిందని, గతంలో ఎవరూ ఆటో డ్రైవర్లకు సాయం చేయలేదని కడపకు చెందిన నాగూరు నాగయ్య పేర్కొన్నారు. ఏడాదంతా ఆటో మరమ్మతులు, బీమా, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ కోసం ఖర్చులు ఉంటాయని, రూ.10వేలు తమకు ఎంతో మేలు చేస్తుందని విశాఖలోని గాజువాకకు చెందిన మహిళా ఆటో డ్రైవర్‌ పైడిమాత తెలిపారు. కరోనాతో పూటగడవని పరిస్థితుల్లో ముందే సాయం అందిస్తున్నారని, మీకు రుణపడి ఉంటామని గుంటూరుకు చెందిన మేడా మురళీశ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, రవాణాశాఖ మంత్రి పేర్ని నాని, బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కమిషనర్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

కొత్తగా 42,932 మంది లబ్ధిదారులు

'గత ఏడాది లబ్ధి పొందిన వారితోపాటు, ఏడాదిలో కొత్తగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ కొన్న, యాజమాన్య హక్కులు పొందిన 42,932 మందికి ఈసారి అదనంగా సాయం అందింది. మొత్తం లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలవారే 84% ఉన్నారు. డ్రైవర్లు చలాన్లు కట్టే పరిస్థితి రాకూడదు’ అని సీఎం తెలిపారు.

ఇదీ చదవండి:

CJI: యాదాద్రీశుడిని ద‌ర్శించుకున్న సీజేఐ దంప‌తులు

Last Updated : Jun 16, 2021, 4:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.