మర్కజ్‌కు వెళ్లినవారిలో అనేకమందికి కరోనా సోకడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న ముఖ్యమంత్రి... కరోనా బాధితులు తప్పు చేసినట్లుగా చూపించవద్దని సూచించారు. కరోనా బాధితులపై మనమంతా ఆప్యాయత చూపాలని హితవుపలికారు. అనుకోకుండా జరిగిన ఘటనగానే భావించాలని చెప్పారు.
కరోనా కాటుకు కులం, మతం, ప్రాంతం, ధనిక, పేద తేడా లేదని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఒకరికొకరు తోడుగా ఉండాలన్నారు. కంటికి కనిపించని వైరస్‌పై మనమంతా పోరాటం చేద్దామన్న సీఎం జగన్... రేపు రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించి సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కరోనాపై యుద్ధం చేస్తున్న వైద్యారోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి జీతాలు ఇస్తామని చెప్పారు.
ఇదీ చదవండీ... ఆ 3 కేటగిరీల ఉద్యోగులకు శుభవార్త