ఆన్‌లైన్ కాల్‌మనీ వ్యవహారంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కాల్‌మనీ వ్యవహారంలో.. వేధింపులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ కాల్‌మనీ కారణంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆత్మహత్యకు పాల్పడిన బాధితుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
గుంటూరు జిల్లా కొర్రపాడులో బాలిక కుటుంబానికి రూ.10 లక్షలు, ప్రకాశం జిల్లాలో దివ్యాంగురాలి కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందించాలని ఆదేశించారు.