ETV Bharat / city

గవర్నర్ బిశ్వభూషణ్​తో ముఖ్యమంత్రి జగన్ భేటీ

విజయవాడ.. రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్‌తో ముఖ్యమంత్రి జగన్‌ దంపతులు భేటీ అయ్యారు. గవర్నర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలపైన సీఎం.. గవర్నర్​తో చర్చించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం.

cm-jagan-meet
cm-jagan-meet
author img

By

Published : Nov 13, 2020, 11:27 AM IST

Updated : Nov 13, 2020, 1:12 PM IST

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాజ్ భవన్​లో అరగంటపాటు జరిగిన భేటీలో పలు అంశాలపై చర్చించారు. తాడేపల్లి నివాసం నుంచి సతీ సమేతంగా బయలుదేరిన సీఎం జగన్ 11 గంటలకు రాజ్ భవన్ చేరుకున్నారు. గవర్నర్ దంపతులకు జగన్ దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్​తో సీఎం భేటీ కొనసాగింది.

cm-jagan-
గవర్నర్ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం దంపతులు

రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో శాసన సభ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది. సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకురానున్న మరిన్ని కీలక బిల్లులపై గవర్నర్​తో ముందస్తుగా సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం పైనా గవర్నర్​తో సీఎం చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో కొవిడ్ కేసుల పరిస్థితి, నివారణకు తీసుకుంటోన్న చర్యలు, సంక్షేమ పథకాల అమలు సహా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

ఇదీ చదవండి:

ఆ అసంతృప్తి వెనుక కథేంటి..?

Last Updated : Nov 13, 2020, 1:12 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.