దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్... కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. సుమారు అరగంటకు పైగా వీరివురు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాలపై చర్చించినట్లు సమావేశం అనంతరం కేంద్ర మంత్రి షెకావత్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర, కేంద్ర ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టుకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటామని షెకావత్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) నివేదికను విస్తృత ప్రయోజనాల కోణంలో పరిశీలిస్తామని తెలిపారు. అన్నీ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పోలవరంపై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి వెంట ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు.
పోలవరం కేంద్రానికి ఇచ్చే ఆలోచన లేదు... మేమే పూర్తి చేస్తాం...