ETV Bharat / city

ఆర్థిక రథచక్రాన్ని కనీస వేగంతోనైనా నడపాలి: సీఎం జగన్ - jagan latest news

ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. వివిధ రంగాలపై లాక్‌డౌన్‌ ప్రభావాన్ని నివేదించారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

cm jagan letter to modi
ఆర్థిక రథచక్రాన్ని కనీస వేగంతోనైనా నడపాలి: సీఎం జగన్
author img

By

Published : Apr 13, 2020, 10:15 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి లేఖ రాశారు. వివిధ రంగాలపై లాక్‌డౌన్‌ ప్రభావాన్ని నివేదించారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రధానికి విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపిందన్న సీఎం... డిమాండ్, సరఫరా చైన్‌కు తీవ్ర ఆటంకం కలిగిందని వివరించారు. ఏప్రిల్‌ 11న వీడియో కాన్ఫరెన్స్‌లో కొన్ని అంశాలు వివరించామన్న ముఖ్యమంత్రి... ఆర్థిక రథచక్రాన్ని కనీస వేగంతోనైనా నడపాల్సిన ఆవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని... రాష్ట్ర జీఎస్‌డీపీలో 34 శాతం వ్యవసాయరంగానిదేనని వివరించారు.

60 శాతానికిపైగా రాష్ట్ర ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నారని వివరించారు. రాష్ట్రంలో 80 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారన్న సీఎం జగన్‌... అందులో 17 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయని వివరించారు. మిర్చి, అరటి, కొబ్బరి, టమాటా, వంగ, బొప్పాయి సాగులో ఏపీదే ప్రథమస్థానమని లేఖలో పేర్కొన్నారు. ఆయిల్‌ ఫాం, పొగాకు, చేపలు, రొయ్యలు, ఫౌల్ట్రీ ఉత్పత్తిలో ఏపీదే ప్రథమస్థానమని సీఎం జగన్ లేఖలో వివరించారు.

ఇదీ చదవండీ... 20 వేల జనతా బజార్లు ఏర్పాటు చేయాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.