ETV Bharat / city

దిల్లీ ఎస్వీ కళాశాల అంశంపై కేంద్ర మంత్రికి సీఎం జగన్ లేఖ

author img

By

Published : Feb 13, 2021, 9:19 AM IST

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిషాంక్​కు సీఎం జగన్ లేఖ రాశారు. దిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కళాశాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

కేంద్రమంత్రికి సీఎం జగన్ లేఖ
కేంద్రమంత్రికి సీఎం జగన్ లేఖ

దిల్లీలోని శ్రీవేంకటేశ్వర కళాశాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌ నిషాంక్‌కు ముఖ్యమంత్రి జగన్‌ లేఖ రాశారు. దిల్లీలో తెలుగు వారికి ఉన్నత విద్యను అందించేందుకు దీన్ని ఏర్పాటు చేశారని, దిల్లీ విశ్వవిద్యాలయం చట్టం-1922 ప్రకారం తితిదే ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ అధ్యక్షతన ఉండే గవర్నింగ్‌ కౌన్సిల్‌ ద్వారా నిర్వహిస్తున్నారని వెల్లడించారు.

తితిదే నుంచి నిధులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీవేంకటేశ్వర కళాశాలను ఆంధ్ర వర్సిటీ అనుబంధ గుర్తింపు కిందకు తెచ్చేందుకు వర్సిటీ చట్టాన్ని సవరణ చేశామన్నారు. నిబంధనల ప్రకారం ఆంధ్ర వర్సిటీ పరిధికి బయట ఉన్న కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే అధికారం లేదని యూజీసీ పేర్కొందని, దీని వల్ల రాష్ట్రానికి చెందిన విద్యార్థులు చాలా నష్టపోతున్నారని వివరించారు. ఆంధ్ర వర్సిటీకి యూజీసీ సెక్షన్‌ 20, క్లాజ్‌(బి) నుంచి మినహాయింపు నివ్వాలని కోరారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.