అవినీతికి తావులేని పాలన అందించాలని... కొత్తగా ఎన్నికైన మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. విజయవాడలో రెండు రోజులపాటు జరిగిన మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల వర్క్‌షాప్‌లో పాల్గొని.... ప్రజలతో ఏవిధంగా మెలగాలో సూచనలు చేశారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని నిర్దేశించారు. పట్టణాల్లో శుభ్రతకు, జీవన భద్రతకు పెద్దపీట వేయాలన్నారు. సచివాలయాల్లో 540 రకాల సేవలు అందిస్తున్నామన్న సీఎం... పనితీరు మెరుగుకు అవసరమైన సూచనలు చేయాలని కోరారు.
కార్పొరేషన్లు, మున్సిపల్ పదవుల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించారు. మహిళలకు 61 శాతం పదవులు కేటాయించామని చెప్పారు. పరిశుభ్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్న సీఎం... ప్రతి వార్డుకు 2 చొప్పున 8 వేల వాహనాలు కేటాయించినట్టు వెల్లడించారు. ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు చేరాలనేది ప్రభుత్వ ఉద్దేశమని... వివక్షకు తావులేకుండా చూడాలని సూచించారు.
అర్హులకు ప్రభుత్వ ఫలాలు కచ్చితంగా అందాలి. దేశంలో తొలిసారిగా వార్డు సచివాలయాల వ్యవస్థ వచ్చింది. గ్రామ సచివాలయాల్లో 540 రకాల సేవలు అందిస్తున్నాం. మరింత మెరుగైన సేవలకు సూచనలు ఇవ్వాలి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి చేశాం. పేదల కాలనీల్లో భూగర్భ డ్రైనేజీ, భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటు చేశాం.- జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి
ఇదీ చదవండి: