కేంద్రమంత్రి సదానందగౌడ్‌కు సీఎం విందు - తాడేపల్లిలో కేంద్ర మంత్రి సదానందగౌడ్
రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రి సదానందగౌడ్‌కు సీఎం జగన్ విందు ఇచ్చారు. కృష్ణాజిల్లా సూరంపల్లిలోని సిపెట్ నూతన భవనాన్ని... సదానంద గౌడ్‌తో కలిసి ప్రారంభించిన ముఖ్యమంత్రి.... తాడేపల్లిలోని తన నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు విందు ఇచ్చారు. అనంతరం సదానంద గౌడ్‌ను శాలువాతో సన్మానించి, రాష్ట్ర పర్యటక జ్ఞాపిక అందజేశారు.